Sunday, January 19, 2025

జగనన్న పర్యటనలో ఆ ఫ్లెక్సీ కలకలం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో ‘ఆడుదాం ఆంధ్రా’ అనే క్రీడా పోటీలను ప్రారంభించారు. నల్లపాడులో ఓ ఫ్లెక్సీ కలవరపాటుకు గురి చేస్తోంది. పోరంబోకు భూమి కాపాడు జగనన్న అంటూ చల్లా అచ్చిరెడ్డి పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ నల్లపాడుకు రానున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీ కనపడడంతో స్థానిక వైసిపి నేతలు కలవరపాటుకు గురయ్యారు. నల్లపాడులో వైసిపి నేతలు దొచుకున్న 543, 546, 550 అనే నంబర్ సర్వేగల భూములను కాపాడాలని చల్లా అచ్చిరెడ్డి కోరారు. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ప్రారంభించడానికి సిఎం వైఎస్ జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లి చేరుకున్నారు. లయోలా పబ్లిక్ స్కూల్ లో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ప్రారంభించారు. 15004 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News