సిటీ బ్యూరో: వివిధ రాజకీయ పార్టీల కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తల ఉ త్సా హం ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తోంది. త మ నాయకుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు నాయకులు, కార్యకర్తలు నగరంలో ప్రధాన మార్గాల్లో ఇష్టానుసారంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీటిని కట్టడి చేయాల్సిన జిహెచ్‌ఎంసి అధికారుల నిర్లక్షం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారుతోంది. అసలే ఎండ కాలం కావడంతో ఒక్కసారిగా భారీ ఈదురగాలులు వీస్తుండడంతో రోడ్లు, ప్లైఓవర్లుకు ఇరు వైపుల ఏర్పాటు చేస్తున్న చిన్న చిన్న ప్లేక్సీలు మొదలుకుని భారీ కకౌట్లు ఎప్పుడు కూలి ఎవరీ మీద పడుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
అసలే ఇర్కుగా ఉంటే ప్లైఓవర్లపై విద్యుత్ స్తంభాలకు తమ రాజకీయ నాయకులపై అభిమానాన్ని చాటుకునేందుకు చిన్నచిన్న ఫ్ల్లెక్సీలను ఏర్పాటు చే యడం, వాటిని వెంటనే తొలగించాల్సిన జిహెచ్‌ఎంసి అధికారులు పట్టించుకోకపోవడంతో ఒకటి రెండు రోజులకు అవి సగం తెగి రోడ్లపై ప్రమాదకరంగా వేలాడుతుండడంతో వాటిగుండా ప్రయాణించే ప్రయాణికులు ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంగళవారం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అను సంధానంగా నిర్మించిన ఫ్ల్లై ఓవర్‌కు ఇరువైపులా ఏర్పాటు చేసిన ప్లెక్సీలు సగం తెగి రోడ్లను ఆక్రమిస్తూ ప్రమాదకరంగా వేలాడుతుండడంతో ఈ మా ర్గం గుండా ప్రయాణించిన నగరవాసులు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ముందుకుసాగారు. ఇది కేవలం మచ్చుకు ఒక్కటి మాత్రమే. నగరంలో ఇలాంటివి సర్వసాధారణంగా మారాయి.
పేరుకే నిషేధమా..!
నగరంలో అధికారికంగా , అనాధికారికం గా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఏర్పాటును చేస్తుండడంతో వాటి కారణంగా తరుచు ప్రమాదాలు చోటుచేసుకుంటుడడంతో గతంలో ఇచ్చిన అనుమతుల గడువు తీరే వరకు వాటికి సంబంధించిన మాత్రమే మినాహాయింపులను నగరంలో హోర్డింగ్‌లు, ప్లెక్సీల ఏర్పాటును నిషేధిస్తూ 2019లో జిహెచ్‌ఎంసి ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయడమే కాకుండా గతంలో ఉన్న అడ్వడైజ్‌మెం ట్ విధానాన్ని సవరించింది. అనుమతులుంటే తప్ప ఎక్కడా చిన్న పోస్టర్ మొదలు హోర్డింగ్ ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టింది.
ఇందుకు విరుద్ధంగా ఎవరూ హోర్డింగ్‌లు, ప్లెక్సీలు ఏర్పాటు చేసినా వారికి ఎన్‌ఫోర్స్, విజిలెన్స్ అండ్ డిజాస్టార్ మేనేజ్‌మెంట్ విభాగం భారీ జరిమానాలను విధించమే కాకుండా ఇందుకు సంబంధించి ఈ చలాన్లకు సంబంధిత వ్యక్తులకు పంపించేవారు. అంతేకాకుండా అధికార పార్టీ మొదలు ఏ రాజకీ య పార్టీల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు వేసినా వారికి ఈ చలాన్లను పంపించారు. అక్రమ హోర్డింగ్‌లు, ప్లెక్సీల ఏర్పాటు చేస్తే ప్రజలే ఫొటోలు తీసి నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్ర త్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా దీనిని పర్యవేక్షించేందకు బుద్ధ్దభవన్‌లో కార్యాలయాన్ని ఏర్పా టు చేశారు. దీంతో నగరంలో హోర్డింగ్‌లు, ప్లెక్సీలు, చివరికి చిన్న చిన్న పోస్టర్లు కూడ వేసేందుకు జంకే పరిస్థితి ఏర్పడింది. అయితే గత కొంత కాలంగా గత కొంత కాలంగా వివిధ రాజకీయ పార్టీల ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ప్లెక్సీల ఏర్పాటు విపరీతంగా పెరిగిపోయింది.
గతంలో హోర్డింగ్‌లు, ప్లెక్సీల ఏర్పాటుపై ఈవిఎండికి చెందిన ఉన్నతాధికారి పూర్తి స్థాయిలో పర్యవేక్షించడమే కాకుండా సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించడం ద్వారా వాటికి ఈ చలన్లాను విధిస్తూ వెంటవెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకునేవారు. అయితే గత కొంతకాలంగా ఇటు జిహెచ్‌ఎంసి అధికారులు కాని, అటు ఈవిఎండి ఉన్నతాధికారులు సైతం పెద్దగా పట్టించుకోకపోవడంతోనే నగరంలో ఎక్కడ చూసినా హోర్డింగ్‌లు ప్లెక్సీలే దర్శనమిస్తున్నాయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అక్రమ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొ లగించడంతో పాటు రోడ్లు, ముఖ్యంగా ప్లైఓవర్లకు ఇరువైపులా చిన్న చిన్న ప్లెక్సీలను ఏర్పాటు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరతున్నారు.