Thursday, December 26, 2024

ఉప్పల్‌లో కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీ వార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలో వరద బాధితులను పరామర్శించేందుకు అట్టహాసంగా వెళ్లిన టిపిసిసి చీప్ రేవంత్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఉప్పల్‌లో కాంగ్రెస్ నాయకుల మధ్య ప్లెక్సీ యుద్దం జరిగింది. రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు ఏషియన్ థియేటర్ వద్ద ఫ్లెక్సీలను పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. సీనియర్ నాయకులు రేగా లకా్ష్మరెడ్డి ఫ్లెక్సీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడంతో సహించలేని మందముల పరమేశ్వర్‌రెడ్డి వర్గం ఆయన ప్లెక్సీ చించివేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తమ నాయకుని ఫోటో ఎందుకు పెట్టలేదని లకా్ష్మరెడ్డి అనుచరులపై విమర్శలు చేశారు. ప్లెక్సీలు ధ్వంసం చేస్తుండగా వీడియో తీసిన మీడియా ప్రతినిధులపై పరమేశ్వర్‌రెడ్డి అనుచరులు స్దానిక పోలీసుల ముందే దాడికి పాల్పడ్డారు. దీంతో మీడియా ప్రతినిధులు రేవంత్‌రెడ్డి పర్యటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సభలు, సమావేశాల్లో తగవులాట పెట్టుకునే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం సాధించి ఏమి సాధిస్తారని జర్నలిస్టు నాయకులు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News