- Advertisement -
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం వ్యాఖ్యల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. తెలంగాణకు రాహుల్‌గాంధీ రాకను నిరసిస్తూ శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లెక్సీలు వెలిశాయి. శనివారం ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీని బతకనీయొద్దు అంటూ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వెలశాయి ఫ్లెక్సీలు. అమరుడు శ్రీకాంతా చారి ఫోటోతో పాటు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఫొటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి.
- Advertisement -