Wednesday, January 22, 2025

తెలంగాణకు ఏమిస్తావ్? (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

amit shah ji Are you announcing any fund for Telangana

అమిత్ షాను ప్రశ్నిస్తూ పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఫ్లెక్సీలు

హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షపై జనాలు తీవ్రంగా రగిలిపోతున్నారు. అందుకే కేంద్ర మంత్రులు ఎప్పుడూ తెలంగాణకు వచ్చిన సామాన్య ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్‌లో సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రశ్నిస్తూ గ్రౌండ్ పరిసరాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. గోవా లిబరేషన్ డేకు కేంద్ర ప్రభుత్వం రూ.300 కోట్లు ఇచ్చింది. మరి తెలంగాణ విమోచన దినం అంటూ ఎందుకు ఒక్క రూపాయి ఇవ్వలేదు? అంటూ అమిత్ షాను ప్రశ్నించారు. తెలంగాణకు ఇవాళైన ఏమైనా ఇస్తారా అంటూ టివోలీ చౌరస్తాతో పాటు పరేడ్ మైదానం చుట్టూ పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే విధంగా ఈ నెల 15న కూడా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏ విధంగా సాయపడిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో కొందరు పోస్టర్లు అంటిం చారు. కంటోన్మెంట్ యువత పేరుతో ఉన్న ఈ పోస్టర్లలో కేంద్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు స్పందించారు. ఇక తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరో చెప్పాలంటూ కొన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన నాయకులు వీళ్లేనంటూ మరికొన్ని పోస్టర్లు దర్శనమిచ్చాయి. దీంతో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ ఏ విధంగా సహకరించారో చెప్పాలంటూ 20 ప్రశ్నలను పొందుపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News