Wednesday, January 22, 2025

హైదరాబాద్ టూ అయోధ్యకు విమానం… ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లే రాముడి భక్తులకు కేంద్ర విమానయాన సంస్థ శుభవార్త తెలిపింది. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఏప్రిల్ 2 నుంచి వారంలో మంగళ, బుధ, గురు, శనివారాల్లో విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని కిషన్ రెడ్డి తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 10.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం 1.25 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి 3.25 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. తెలుగు ప్రజల కోస విమాన సర్వీసుల సౌకర్యం కల్పించినందుకు సింధియాకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన ట్విట్టర్‌లో కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు బుక్ చేసుకున్న టికెట్‌ను ఆయన జత చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News