Thursday, January 16, 2025

షిర్డీకి ఇక రాత్రిపూటా విమానాలు

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రఖ్యాత తీర్థస్థలం షిర్డీ క్షేత్రానికి ఇక రాత్రిపూట కూడా విమానంలో వెళ్లవచ్చు. సంబంధిత నైట్ ల్యాండింగ్ లైసెన్సును అక్కడి విమానాశ్రయానికి పౌర విమానాయాన అధీకృత సంస్థ (డిజిసిఎ) మంజూరు చేసింది. దీని వల్ల మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని విమానాశ్రయంలో రాత్రిపూట కూడా విమానాల రాకపోకలు ఉంటాయి. షిర్డీకి యాత్రికుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, కాలయాపన లేకుండా షిర్దీ సాయిబాబా ఆలయ సందర్శనకు వీలు కల్పించేందుకు ఇప్పటి విమాన రాత్రి పూట సౌకర్యం వీలు కల్పిస్తుంది.

షిర్డీ ఇప్పటికే పలు విధాలుగా రైళ్ల సౌకర్యంతో ఉంది. అక్కడికి ముంబై నాగ్‌పూర్ సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే మార్గం ఉంది. ప్రతిష్టాత్మక వందేభారత్ రైలు సర్వీసు కూడా అందుబాటులో ఉంది. సాయి భక్తులకు ఇది మంచి శుభవార్త అని , షిర్డీ ఎయిర్‌పోర్టుకు నైట్ ల్యాండింగ్ సౌకర్యం ఏర్పాటుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ప్రధాని మోడీకి, కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News