Tuesday, September 17, 2024

ఫ్లిప్‌కార్ట్ చేతికి వాల్‌మార్ట్ ఇండియా వ్యాపారం

- Advertisement -
- Advertisement -

Flipkart acquires Walmart India

న్యూఢిల్లీ: వాల్‌మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను ఇకామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ సొంతం చేసుకుంది. వాల్‌మార్ట్ ఇండియా ఉత్తమ ధర క్యాష్ అండ్ -క్యారీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. వాల్‌మార్ట్ హోల్‌సేల్‌ను సొంతం చేసుకోవడం ద్వారా ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌ను దేశంలో ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో కంపెనీ హోల్‌సేల్ సామర్థం మరింత బలోపేతం కానుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అలా గే కిరాణా, ఎంఎస్‌ఎంఇ(సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) వృద్ధికి దోహదం చేస్తుందని ఫ్లిప్‌కార్ట్ వివరించింది. ‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ప్రారంభించ డం ద్వారా దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాల కోసం టెక్నాలజీ, లాజిస్టిక్స్, ఫైనాన్స్‌లలో సామర్థ్యాలను విస్తరిస్తాం’ అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సిఇఒ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు. ఆగస్టులో ఫ్లిప్‌కార్ట్ టోకు సేవలను ప్రారంభించనుంది.

Flipkart acquires Walmart India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News