Wednesday, December 25, 2024

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. వీటి పై భారీ తగ్గింపు!

- Advertisement -
- Advertisement -

ఈరోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి అందరూ ఎంతగానో ఇష్ట పడుతారు. అయితే, చాలా మంది ఎప్పుడెప్పుడు ఆన్ లైన్ లో ఆఫర్స్ ఉంటాయంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు. తద్వారా వారు చౌకైన స్మార్ట్‌ఫోన్‌లు లేదా ఇతర పరికరాలను సరసమైన ధరలకు పొందవచ్చు అని అనుకుంటారు.

గత నెలలో అనేక పండుగలు ఉన్న నేపథ్యంలో అనేక ఆఫర్స్ పెట్టారు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహిస్తున్న బ్లాక్ ఫ్రైడే సేల్ వంతు వచ్చింది. ఈ సేల్ ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ లో నవంబర్ 24 నుండి అంటే ఈరోజు రాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి నవంబర్ 29 వరకు కొనసాగుతుంది. కాగా, ఈ సేల్ సంవత్సరం చివరిలో నిర్వహిస్తారు.

ఈ సేల్‌లో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్ నుండి గృహోపకరణాల వరకు ప్రతి కేటగిరీలో భారీ ఆదా చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే లేదా కొత్త ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు Flipkart బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఆకర్షణీయమైన డీల్‌లను పొందొచ్చు.

ఈ ఫోన్స్ పై భారీ తగ్గింపు

బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్లపై గొప్ప ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 15 కేవలం రూ. 57,749కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,23,999 గా ఉంటుంది. ఇక ఐఫోన్ 15 ప్లస్ కూడా 65,999 రూపాయలకు అందుబాటులో ఉంటుంది.

ఇక సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 ధర రూ. 38,999కి తగ్గవచ్చు. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్24+ రూ. 64,999కి అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా.. వివో వి30 Pro, CMF ఫోన్ 1 మరియు నథింగ్ ఫోన్ (2a) ప్లస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై కూడా గొప్ప తగ్గింపులు ఉంటాయి.

 

ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్‌ల పై భారీ తగ్గింపులు

బ్లాక్ ఫ్రైడే సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు కాకుండా.. అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉంటాయి. స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంక్‌లు వంటి గాడ్జెట్‌లపై 80 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. దీంతోపాటు వివిధ ల్యాప్ టాప్స్ మీద అనేక ఆఫర్స్ ఉండనున్నాయి.

అంతేకాకుండా.. కొత్త టీవీ, వాషింగ్ మెషీన్ లేదా రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీరు వీటిపై 75 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ విక్రయం షాపింగ్ కోసం ఒక గొప్ప అవకాశం. దీనిలో మీరు మీకు ఇష్టమైన ఉత్పత్తులను చాలా సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News