- Advertisement -
న్యూఢిల్లీ: ప్రముక ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో నాసిరకం డొమెస్టిక్ ప్రెషర్ కుక్కర్‌లను విక్రయించడానికి అనుమతించినందుకు రూ. 1,00,000 జరిమానా విధించినట్లు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) బుధవారం తెలిపింది. నాసిరకం ప్రెషర్ కుక్కర్‌లను విక్రయించడానికి అనుమతించినందుకు, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించి నందుకుగానూ ఫ్లిప్‌కార్ట్‌పై రూ. లక్ష జరిమానా విధించినట్లు సిసిపిఎ చీఫ్ కమిషనర్ నిధి ఖరే తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో విక్రయించిన మొత్తం 598 ప్రెషర్ కుక్కర్‌ల వినియోగదారులకు తెలియజేయాలని, ప్రెషర్ కుక్కర్‌లను రీకాల్ చేసి వినియోగదారులకు డబ్బు వెనక్కి ఇవ్వాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.
- Advertisement -