Sunday, November 24, 2024

యుపిఐ సేవలు ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులో తెచ్చింది. డిజిటల్ చెల్లింపులను మరితం సులభతరం చేయడం కోసం యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో యుపిఐ హ్యాండిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 50 కోట్ల మందికి పైగా కస్టమర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ లోపల, వెలుపల లావాదేవీల కోసం ఇకపై యాప్‌లోనే ఉన్న యుపిఐహ్యాండిల్‌తో పేమెంట్ చేయవచ్చు.పేమెంట్ తర్వాత కస్టమర్లకు మెరుగైన అనుభవం కోసం సూపర్ కాయిన్లు, క్యాష్‌బ్యాక్,బ్రాండ్ వోచర్లు తదితర ప్రయోజనాలను అందించనుంది.

యాప్‌లో ఇకామర్స్ లావాదేవీలు, స్కాన్ చేసి యుపిఐ ఐడికి చెల్లించడం, రీచార్జిలు,బిల్లు చెల్లింపులు అందులో చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ఫిన్‌టెక్, పేమెంట్స్ గ్రూపు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనేజా మాట్లాడుతూ..‘సురక్షితమైన చెల్లింపులు జరుపుతూ కప్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. యుపిఐ చెల్లింపులపై రివార్డులు, వోచర్లు,సూపర్ కాయిన్లు ప్రకటిస్తాం.డిజిటల్ ఇండియా వైపు అడుగులు వేస్తున్న క్రమంలో మమ్మల్ని మేం మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News