Thursday, January 23, 2025

‘వ్యాపారి దివస్’ తాజా ఎడిషన్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్..

- Advertisement -
- Advertisement -

భారతదేశంలోని స్వదేశీ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ డిజిటల్ బీ2బి ప్లాట్‌ఫారమ్‌గా అయిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, తన సభ్యులకు పొదుపు, లాభాలను వేగవంతం చేసే లక్ష్యంతో కంపెనీ వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ అయిన ‘వ్యాపారి దివస్’ని నేడు ప్రారంభించామని ప్రకటించింది. ఏప్రిల్ 03 నుంచి ఏప్రిల్ 09, 2023 వరకు లైవ్ అవుతోంది. ఈ క్యాంపెయిన్ అన్ని ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ స్టోర్‌లు మరియు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ / మొబైల్ అప్లికేషన్‌లలో స్టేపుల్స్, పర్సనల్, హోమ్ కేర్, ఫుడ్ మరియు పానీయాలతో సహా అనేక వర్గాలలో అద్భుతమైన డీల్‌లను అందిస్తుంది.

‘టూటేగా ఫాయిదే కా రికార్డ్’ అనే ట్యాగ్‌లైన్‌తో, డిస్కవరీ జోన్, వ్యాపారి దివాస్ స్పెషల్స్, బై వన్ గెట్ వన్ ఆఫర్, ఫ్లాష్ డీల్స్ తదితర అనేక ఆకర్షణీయమైన ఆఫర్‌లతో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. దీనితో పాటు మొదటిసారిగా, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ యాప్ మరియు ఇన్-స్టోర్ కొనుగోళ్లు రెండింటిపై సభ్యులకు రూ.9,999 వరకు హామీ ఇవ్వబడిన క్యాష్‌బ్యాక్ ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ బిజినెస్ హెడ్ కోటేశ్వర్ ఎల్‌ఎన్ మాట్లాడుతూ..“కిరణాలు మరియు ఎంఎస్‌ఎంఇ (MSME)ల వృద్ధి, శ్రేయస్సును పెంపొందించే స్థిరమైన వ్యాపారాన్ని నిర్మించాలనే మా ప్రధాన నిబద్ధతలో భాగంగా, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సాంకేతికతతో కూడిన లోతైన వ్యాపార నైపుణ్యం, లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగిస్తోంది. ఇది కంపెనీ తన సభ్యులకు గణనీయమైన విలువతో, విస్తృత ఉత్పత్తి ఎంపికను అందించడానికి వీలు కల్పిస్తోంది. దీనితో వారు సమాచారంతో కూడిన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతోంది. మా సభ్యులకు భారీ ప్రయోజనాలు, పొదుపులను అందించడంలో సహాయపడే ‘వ్యాపారి దివస్’ తాజా ఎడిషన్‌ను ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము’’ అని పేర్కొన్నారు.

ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సాంకేతిక నైపుణ్యం, లోతైన మార్కెట్ అవగాహన కిరాణాలు, ఎంఎస్‌ఎంఇలకు సంపూర్ణ, అర్థవంతమైన వృద్ధి పర్యావరణ వ్యవస్థను అనుమతిస్తుంది. ప్లాట్‌ఫారమ్‌కు ఉన్న విస్తృతమైన నెట్‌వర్క్ ద్వారా, ఎస్‌ఎంఇ బ్రాండ్‌లు ప్రత్యక్షత మరియు పాన్-ఇండియా మార్కెట్‌ప్లేస్‌లో అందుబాటును పొందుతాయి. తన డిజిటల్-ఫస్ట్ విధానానికి అనుగుణంగా, ప్లాట్‌ఫారమ్ చిన్న బ్రాండ్‌లకు సమాచారంతో కూడిన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే అనేక వ్యాల్యూ- యాడ్‌లను కూడా అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News