- Advertisement -
న్యూఢిల్లీ : డిజిటల్ బి2బి సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ దేశంలో తన ఉనికిని మూడింతలు పెంచుకోనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షలాది చిన్న వ్యాపారులకు, కిరాణాలకు ప్రయోజనం చేకూర్చేందుకు 2,700 నగరాల్లో తన సేవలను అందించనుంది. 2020 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ 2021 మొదటి అర్థభాగంలో పటిష్ఠ వృద్ధిని సాధించింది. సంస్థ హెడ్ అదర్శ్ మీనన్ మాట్లాడుతూ, బి2బి రిటైల్ వ్యవస్థకు మరింత సుసంపన్నత, దేశవ్యాప్తంగా కిరాణాలకు సమస్యలను తొలగించే లక్ష్యంతో ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌ను ప్రారంభించామన్నారు.
Flipkart Wholesale plans to more than triple
- Advertisement -