Thursday, December 19, 2024

మల్కాపూర్ పెద్దచెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్

- Advertisement -
- Advertisement -

భారత సైన్యానికి ఓడిఎఫ్‌లో తయారు చేసిన నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల (ఇన్‌ఫ్యాంట్రీ కాంబేడ్ వెహికల్స్) ట్రయల్ రన్ సంగారెడ్డి జిల్లా, మల్కాపూర్‌లోని పెద్ద చెరువులో శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. ఓడిఎఫ్‌లో తయారైన బిఎంపి సెకండ్ 14 టన్నుల ఇన్‌ఫ్యాంట్రీ కాంబేడ్ వెహికల్ ట్రయల్ రన్‌ను ఓడిఎఫ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్‌ఎస్ ప్రసాద్ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత సైనికులను ఒక్కో వాహనంలో పది మందిని బ్యాక్‌ఆఫ్ ఫీల్డ్‌లోకి తరలించడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయని అన్నారు.

సైనికులకు విపత్కర పరిస్థితుల్లో గాయాలైనప్పుడు బిఎంపి సెకండ్ ఇన్‌ఫ్యాంట్రీ కాంబేడ్ వెహికల్స్‌లో అంబులెన్స్‌లో న్యూక్లియర్ బయోలజికల్ కెమికల్ వెహికల్‌లో తరలించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. 14 టన్నుల బరువు ఉన్న ఈ వాహనాలు నీటిలో పడవలా స్పీడ్‌గా వెళ్లడం ప్రత్యేకత అన్నారు. ప్రతి సంవత్సరం 120 వాహనాలను భారత సైన్యానికి అందజేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం 25 రకాల ట్రయల్స్ చేసి వాహనాలను అప్పగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ ఆఫీసర్ రత్నప్రసాద్, జాయింట్ జనరల్ మేనేజర్ సర్జిత్‌రెడ్డి, ఓడిఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News