Monday, December 23, 2024

వరదపై వాగ్యుద్ధం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో నివేదికలు అందగానే రైతులకు, ప్రజలకు నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన భారీ వ ర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన నష్టం, ప్ర భుత్వం చేపట్టిన చర్యలపై శుక్రవారం శాసనస భ సమావేశాల్లో చర్చ జరిగింది. ఎంఎల్‌ఎలు గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్ బాబు, అక్బరుద్దీన్ ఓవైసీ, సండ్ర వెంకటవీరయ్య, రఘునందన్‌రావు పలువురు సభ్యులు లేవనెత్తిన సందేహాలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సభలో సు దీర్ఘ వివరణ ఇచ్చారు. గతేడాది అకాల వర్షాల తో పంట నష్టం జరిగితే ఎకరాకు 10వేల చొ ప్పున 4.50 లక్షల ఎకరాలకు గాను రూ. 455 కోట్లు ప్రకటించి ఇప్పటికే రైతులకు రూ.150 కోట్ల పరిహారం అందజేశామని తెలిపారు.

మి గతా మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు. ప్రస్తు త వరద ప్రభావిత ప్రాంతాల నుంచి అంచనా లు రాగానే తక్షణ సహాయం కింద విడుదల చే సిన రూ. 500 కోట్లు అందజేస్తామని వెల్లడించా రు. వరదల ధాటికి ఇల్లు కూలిన వారికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం చేస్తామని తె లిపారు. కేంద్రం సహాయం చేసినా.. చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ స హాయం కోసం ఎప్పుడూ ఎదురు చూడలేదన్నా రు. వర్షాల కారణంగా పూర్తిగా కూలిన ఇళ్లు 419, పాక్షికంగా కూలిన ఇళ్లు 7500 ఉన్నాయని మంత్రి తెలిపారు. 150 పునరావాస కేం ద్రాలను ఏర్పాటు చేసి 770 నివాసాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. క్రమంలోనే వరదల్లో చిక్కుకున్న 1500 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారని వివరించారు. 139 గ్రామాల్లో వరదల న ష్టం ఎక్కువ జరిగిందని ఆయన వెల్లడించారు.
* చరిత్రలో ఎన్నడూ చూడని వర్షాలు..
గత నెలలో రెండు దఫాల్లో కేవలం 6 గంటల వ్యవధిలో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశంతో ముందస్తు జాగ్రత్త చర్యలతో ప్రకృతి వైపరీత్యాలతో జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మాత్రం నిలువరించగలిగామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఏడాది పొడవునా కురిస్తే ఎంత వర్షపాతం అయితే నమోదు అవుతుందో.. అంతే స్థాయిలో ఒక్క రోజులో కురిసిందన్నారు. తన నియోజకవర్గంలో అత్యధికంగా వర్షాలు కురిశాయి.

కేవలం 6 గంటల సమయంలో 46 సెం.మీ వర్షం కురిసిందన్నారు. జూలై 17 నాటికి రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 20 శాతం ఉంటే 28 జూలై నాటికి +66 శాతం అధిక వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి,హన్మకొండ, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ ,ములుగు, జగిత్యాల్, నిర్మల్, నిజామాబాద్,పెద్దపల్లి తదితర జిల్లాల్లో సంవత్సరం మొత్తంలో నమోదు అయ్యే వర్షపాతంలో 50 శాతం కేవలం 8 రోజుల్లోనే నమోదైందన్నారు.

* ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణ..
వరద పరిస్థితిపై అధికార యంత్రాంగంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిక్షణం వరద పరిస్థితిని సమీక్షించారని మంత్రి వెల్లడించారు.ప్రాజెక్టుల వారీగా ఎస్సారెస్పీ,కడెం,అప్పర్ మానేర్,నిజాంసాగర్, భద్రాచలం దగ్గర గోదావరి ఉదృతిని ఇలా అన్ని ప్రాజెక్టులకు వచ్చే వరదను ప్రతీ గంటా సమీక్షిస్తూ.. ప్రాణనష్టం జరగకుండా, వరద బాధితులు ఇబ్బంది పడకుండా లోతట్టు ప్రాంతాల్లో విపత్తు నిర్వహణను, సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను అప్రమత్తం చేశారు. వరద సహాయక చర్యల్లో భాగంగా 8 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు 4 బోట్లుతో పాల్గొన్నారు. వరదలకు ప్రభావిత 139 గ్రామాల్లో 7,870 ఇండ్ల నుంచి 27,063 మందిని 157 పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించామని వెల్లడించారు.

* ఆపత్కాలంలో.. అధికారులు అద్భుతంగా పనిచేశారు..
క్షేత్ర స్థాయిలో పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ తో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశంసించారు.పోలీస్ సిబ్బంది సుమారు 19 వేల మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి క్షేమంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. విద్యుత్ సిబ్బందికి అసెంబ్లీ వేదికగా సెల్యూట్ చేస్తున్న. వరదల్లో ఈదుకుంటూ ప్రాణాలకు తెగించి కరెంట్ పునరుద్దరణ చేసిన వారి సాహసానికి శాసనసభ్యులు అభినందనించాలని కోరారు. మిషన్ కాకతీయ ఫలితాల వల్ల చెరువులు పటిష్టంగా తయారయ్యి ఎక్కువగా గండి పడలేదు.

కొద్దిగా గండి పడ్డ చెరువులకు కూడా ఇరిగేషన్ శాఖ సిబ్బంది సకాలంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో వరదలు వచ్చినప్పుడు 11వేలు, 4వేలు చెరువులు తెగితే మిషన్ కాకతీయ చేపట్టిన తర్వాత చెరువులను బాగు చేయడం వల్ల 90 నుంచి 100 చెరువులు తెగాయని,మొన్నటి అధిక వర్షాలకు 300 చెరువులు తెగాయి. రోడ్లు భవనాలు శాఖ అధికారులు ప్రజా రవాణాకు ఎక్కడా ఇబ్బంది రాకుండా తెగిన రోడ్లు, కల్వర్టులు వెంట వెంటనే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేశాం. రెవెన్యూ శాఖ,పంచాయతీ రాజ్ శాఖ అందరినీ సమన్వయం చేస్తూ క్షేత్ర స్థాయిలో వారు పనిచేసిన తీరు ప్రశంసనీయం అన్నారు.

* కేంద్ర ప్రభుత్వ కక్ష్య పూరిత వైఖరి..
గుజరాత్‌లో వర్షం పడితే.. ప్రధాని మోడీకి పడిశం పడుతుందన్నది అని సోషల్ మీడియాలో ఓ జోక్ ప్రచారం అవుతుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రంలో ఎప్పుడు వరద వచ్చినా ప్రధానిగా ఆయన వెంటనే స్పందిస్తారు. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రజలను మరోలా చూస్తారు. ప్రకృతి వైపరీత్యాలతో తెలంగాణ ప్రజలు అల్లాడుతుంటే సాయం చేసేందుకు మోడీ సర్కారుకు చేతులు రావడం లేదు. 2016 సెప్టెంబర్, 2020 అక్టోబర్‌లో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో రైతులు, ప్రజలు తల్లడిల్లిపోయారు.

2016లో కురిసిన వర్షాలకు రూ.3,851 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేంద్ర బృందం అంచనా వేసింది. 2020లో కురిసిన వర్షాలతో సుమారు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిన ట్టు అంచనా వేశారు. ఈ రెండేండ్లలో కలిపి రూ.8,851 కోట్ల నష్టం జరిగింది. అయినా, కేంద్రం నయా పైసా విదిల్చలేదు. కానీ, 2018- నుంచి 2022 వరకు ఇతర రాష్ట్రాలకు విపత్తు సాయం కింద కేంద్ర ప్రభుత్వం 44,219 కోట్లు విడుదల చేసిందన్నారు. దున్నపోతుపై వానపడ్డట్టు.. వరద సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం నుంచి స్పందన కరువైంది. మంత్రులు వెళ్లినా, స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వెళ్లి విజ్ఞప్తి చేసినా మోడీ సర్కారు పట్టించుకోలేదు.

* బిజెపి రాష్ట్రాలకు నిధుల వరద..
తెలంగాణకు పైసా ఇవ్వటానికి ఒప్పుకోని కేంద్రం.. బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రం నిధుల ‘వరద’ పారిస్తున్నదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. 2020లో వచ్చిన వరదలకుగాను 2022 ఏప్రిల్ 5న కేంద్రం 16 రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసింది. ఇందులో తెలంగాణ పేరేలేదు. పొరుగు రాష్ట్రం ఎపికి రూ.351.43 కోట్లు, గుజరాత్‌కు రూ.1,000 కోట్లు, కర్ణాటకకు రూ.994.27 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.600 కోట్లు, ఒడిశాకు రూ. 500 కోట్లు, బీహార్‌కు రూ.1,038 కోట్లు, మహారాష్ట్రకు రూ.355.39 కోట్లు, తమిళనాడుకు రూ.352.85 కోట్లు విడుదల చేసిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం వద్ద ప్రకృతి విపత్తుల కోసం ఖర్చు చేయడానికి ఉంచుతామని చెప్పే రాష్ట్ర నిధులకే సవాలక్ష ఆంక్షలు పెడుతుంది. ఎస్‌డిఆర్‌ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో వాడుకోవడానికి వీలు లేకుంటే.. రాష్ట్ర ప్రభుత్వమే కరోనా సమయంలో, వర్షాలు వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు పునరుద్దరణ కోసం, పంట నష్ట సహాయం కోసం, జిహెచ్‌ఎంసి వరదలప్పుడు ఒక్కో కుటుంబానికి 10వేలు చొప్పున( కేంద్రం నిబంధనల ప్రకారం 1800 చొప్పున మాత్రమే ఇవ్వొచ్చు) రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.

మంత్రి కెటిఆర్.. శ్రీధర్‌బాబు మధ్య సంవాదన…
వరద సహాయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రసంగిస్తుండగా మంత్రి కెటిఆర్ మధ్యలో అడ్డు తగిలారు. విద్యుత్‌పై రేవంత్ కామెంట్స్‌ను ప్రస్తావించారు. వరదలపై సమాధానం చెప్పలేక మంత్రి డైవర్ట్ చేస్తున్నారని శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌పై ప్రత్యేక చర్చ పెడితే తాము చర్చకు సిద్దమని శ్రీధర్ బాబు సవాల్ విసిరారు. శ్రీధర్‌బాబును మాట్లాడనివ్వకుండా మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. శ్రీధర్‌బాబు ప్రసంగం పూర్తి కాకుండానే వెంటనే అక్బరుద్దీన్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు.మధ్యలో భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని..

పిసిసి ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న మాట అనలేదని వివరణ ఇచ్చారు. తాము వీడియో చూపిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వెంటనే వరద నష్ట పరిహారం ప్రకటించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం శాస్త్రీయంగా లేదని… వరదలకు ఇది కూడా ఒక కారణమని శ్రీధర్‌బాబు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం పుచ్చుకుని.. ఉప ద్రవం వచ్చింది కాబట్టి నష్టం జరిగింది.. ప్రభుత్వం మీద శ్రీధర్‌బాబు బురద జల్లొద్దని మంత్రి కోరారు.

* చెక్ డ్యామ్‌లతో నష్టం అంటారని నేను ఊహించలేదు : హరీశ్‌రావు
“పిసిసి ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి 24 గంటల కరెంట్ వద్దు అంటున్నారు. చెక్ డ్యామ్‌లు వద్దని శ్రీధర్ బాబు అంటున్నారు. మరో కాంగ్రెస్ నేత ధరణి వద్దు అంటున్నారు. ఇదేనా కాంగ్రెస్ విధానం. చెక్ డ్యామ్‌ల వల్ల నష్టం అంటారని నేను ఊహించలేదు” అని శాసనసభలో మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ధరణి వద్దు.. చెక్ డ్యామ్‌లు వద్దు.. 24 గంటల కరెంట్ వద్దు అంటారు… వద్దు అనేవారు కాంగ్రెస్‌ను ఆదరిస్తారు.లేదంటే మమ్ములను ఆదరిస్తారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News