అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని వరద విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఐదు జిల్లాల్లో దాదాపు 2 లక్షలకుపైగా హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. రెండు డ్యామ్ లు, చెరువులు, కాల్వలకు గండి పడడంతో తీవ్ర నష్టం వాటిల్లందన్నారు. భారీ వర్షలు, వదరల ధాటికి 60 మంది మృతి చెందగా, పలువురు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారని, ఎపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని మోడీని అడిగారు. ప్రధాని మోడీ గాని, కేంద్ర మంత్రులుగాని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల బాధలు గుర్తించాలన్నారు. తక్షణమే ఎపికి కేంద్రం నుండి వరద సహాయక నిధులు విడుదల చేయల్సిందిగా కోరారు.
ఎపిలో వరద విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి….
- Advertisement -
- Advertisement -
- Advertisement -