Sunday, December 22, 2024

నాగార్జున సాగర్, జూరాల జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.7 లక్షల క్యూసెక్కులుండగా 42 గేట్లు ఎత్తి 2.7 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 316.97 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.65 టిఎంసిలుండగా ప్రస్తుత నీటి నిల్వ 6.67 టిఎంసిలుగా ఉంది.

నాగార్జున సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 506.6 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యం 312.04 టిఎంసిలుండగా ప్రస్తుతం నీటి నిల్వ 125.97 టిఎంసిలుగా ఉంది. నాగార్జున సాగర్‌లో ఇన్‌ఫ్లో 52,199 క్యూసెక్కులుండగా ఔట్‌ఫ్లో 6282 క్యూసెక్కులుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News