హైదరాబాద్: నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్‌కు 4.19 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 34 వేల క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 558.6 అడుగులుగా ఉంది. సాగర్ నీటినిల్వ సామర్థం 312.50 టిఎంసిలుకాగా ప్రస్తుతం 229.13 టిఎంసిలుగా ఉంది.
కర్నాటక, మహారాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల జలాశయానికి 3.10 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. జూరాల ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి 2.86 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 317.91 మీటర్లు ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.65 టిఎంసిలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 5.77 టిఎంసిలుగా ఉంది.
నాగార్జున సాగర్, జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
- Advertisement -
- Advertisement -
- Advertisement -