Monday, November 18, 2024

జంట జలాశయాలకు వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్ నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతుంది. మూడు రోజులుగా జలమండలి అధికారులు నీటి సామర్ధం పెరుగుతుండటంతో ఎప్పకప్పుడు వరద జలాలను దిగువ మూసీలోకి వదులుతున్నారు. ఆదివారం హిమాయత్‌సాగర్ ప్రాజెక్టుకు 1000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా రెండు గేట్లు ఎత్తి 1340 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. హిమాయత్ సాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1762.00 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్‌కు 100 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. గరిష్ట స్దాయి నీటి మట్టం 1790 అడుగులకు ప్రస్తుతం నీటి మట్టం 1785 అడుగులకు చేరింది.

హిమాయత్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మూసీ నదికి వరద పెరిగింది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద సమీపంలో బారీకేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టారు. అదే విధంగా పలు ప్రాంతాల్లో కలుషిత నీరు వస్తుండటంతో ట్యాంకర్ల ద్వారా స్దానిక వాటర్‌బోర్డు సురక్షితమైన మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అదే విధంగా వాంతులు, విరేచనాలు కాకుండా క్లోరిన్ బిల్లలు పంపిణీ చేస్తున్నారు. జంట జలాశయాలకు జలకళ రావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలను అస్వాదీస్తున్నారు.

అదే విధంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు మంగళ,బుధవారాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మళ్లీ జలాశయాలకు వరద ఉధృతి పెరిగే అవకాశముందని జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు, జలమండలి అధికారులు ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందుస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమర్జెన్సీ బృందాలు, 24 గంటల పాటు సీవరేజి కార్మికులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు. నగర ప్రజలు వరద ముంపుకు గురికాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News