Sunday, April 6, 2025

సరిహద్దు గ్రామాల్లో వరద ముప్పు…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలకు సట్లెజ్ నదికి వరదలు వచ్చి పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో వందల గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. ఈ ప్రభావం ఆ జిల్లాలో ఉన్న భారత్‌పాకిస్థాన్ సరిహద్దు పైనా పడింది. బీఎస్‌ఎఫ్ పోస్టులతోపాటు అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న ఫెన్సింగ్ కూడా నీట మునిగింది. సరిహద్దులకు ఆనుకుని ఉన్న అనేక గ్రామాలు నీట మునిగిపోతున్నాయి.

ఫౌంగ్, భాక్రా ఆనకట్టల నుంచి పొంగిపొరలుతున్న అదనపు నీటితో పరీవాహక జిల్లాలైన గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్, తరన్ తారన్, కపుర్తలా, రూప్‌నగర్, ఫిరోజ్‌పూర్‌ల్లోని 150 కి పైగా గ్రామాలు వరదను ఎదుర్కొంటున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌తో కలిసి బీఎస్‌ఎఫ్ సిబ్బంది రిలీఫ్ ఆపరేషన్‌లలో పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు. కేవలం ఫిరోజ్‌పూర్ లోనే 2500 మంది గ్రామస్థులను తరలించినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News