Monday, December 23, 2024

ఉక్రెయిన్ డ్యాం పేల్చివేతతో తీర ప్రాంతాలకు వరద ముప్పు

- Advertisement -
- Advertisement -

ఖెర్సాన్ (ఉక్రెయిన్): దక్షిణ ఉక్రెయిన్ లోని నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్యా డ్యాం పేల్చివేతతో దిగువనున్న ప్రాంతాల నుంచి బుధవారం అత్యవసరంగా వేలాది మందిని తరలిస్తున్నారు. నీపర్ నదీపరీవాహక ప్రాంతం లోని 42 వేల మంది ప్రజల జీవితాలు ప్రమాదంలో పడినట్టు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే 24 గంటల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఖెర్సాన్‌లో మరో మూడు అడుగుల వరకు నీటి మట్టం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే యెల్జావెటికోవ్ అనే గ్రామం లోని వంతెన కొట్టుకుపోయింది. నీపర్ పశ్చిమ ఒడ్డున ఉన్న పదిగ్రామాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలోనే పెద్దదైన ఈ డ్యామ్ జలవిద్యుత్‌ను అందించడమే కాకుండా, వ్యవసాయానికి సాగు నీటిని తాగునీటిని కూడా భారీగా అందిస్తోంది. ఖెర్సన్ రీజియన్‌లో ఈ డ్యామ్ ఉంది. గత ఏడాది నుంచి రష్యా ఆక్రమణలో ఈ రీజియన్ ఉంటోంది. ఉక్రెయిన్‌కు, రష్యా ఆక్రమిత ప్రాంతానికి మధ్యలో ఈ నది ఉంది. కావాలనే రష్యా ఈ విధ్వంసానికి పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఆరోపించారు. డ్యాం పేల్చివేతతో కనీసం తాగడానికి నీళ్లు అందక కొన్ని వందలు వేల మంది ఇళ్లు విడిచిపెట్టి పోయారని ఆయన టెలిగ్రాం పోస్ట్ ద్వారా ఆవేదన చెందారు.

నీపర్ నదీ తీరంలో ఉన్న 1800 ఇళ్లు జలమయమయ్యాయని, దాదాపు 1800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించ వలసి వచ్చిందని ఖెర్సన్ రీజినల్ మినిస్ట్రీ అడ్మినిస్ట్రేషన్ అధినేత ఒలెక్‌సాండి ప్రొకుదిన్ వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు వరద నీరు ముంచుకువచ్చింది. రిస్కు సిబ్బంది ప్రజలను మోసుకుంటూ సురక్షిత ప్రాంతాలకు తరలించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. రష్యా నియంత్రణ లో ఉన్న నోవా కఖోవ్‌స్క నగరంలో వీధులన్నీ నీటిలో తేలియాడుతున్నాయి. ఏడుగురు గల్లంతయ్యారని రష్యా నియమిత మేయర్ వ్లాదిమిర్ లియోంటేవ్ చెప్పారు. ఈ నగరం లో 900 మందిని ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు తరలించామని తెలిపారు. నీట మునిగిన ఇళ్ల పైకప్పులపై ఉన్న వారిలో 17 మందిని రక్షించామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News