Monday, January 20, 2025

ముంపు బాధితులను ఆదుకోవాలి

- Advertisement -
- Advertisement -

రాయికల్: వర్షాలతో ఇళ్లు, పంటలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకో వాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి కోరారు. రాయికల్ పట్టణంలో ముంపునకు గురైన కాలనీలను శుక్రవా రం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించి బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా బాధితులతో ఆయన మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన బాధితుల విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతానన్నారు. ఇండ్లు కూలిపోయిన కుటుంబాలకు ఇళ్లు మంజూరైయ్యేలా చూస్తానని తెలిపారు. వర్షాలతో చాలా నష్టం జరిగిందని చాలా మంది నిరాశ్రయులై య్యారని చెప్పారు. ఇండ్లు, పంటలు, రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు.

ఇళ్లల్లోకి వరదనీరు చేరి నిత్యావసరవస్తువులు తడిసిపోయిన కుటుంబాలకు సాయం అందిస్తామన్నారు. ఎవరు అధైర్యపడవద్దని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వీరి వెంట పార్టీ నాయకులు గోపి రాజరెడ్డి, తంగెళ్ల రమేష్, మున్నూ, ఎద్దండి దివాకర్‌రెడ్డి, మండ రమేష్, కొయ్యడి మహిపాల్ రెడ్డి, గుర్రం మహేంధర్, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News