- Advertisement -
పాట్నా : బీహార్‌లో వరద పరిస్థితి మరింత దిగజారింది. రాష్ట్రంలోని దర్బంగ ఆసుపత్రిలో వరద నీరు వచ్చి చేరింది. రెండు మూడు రోజులుగా వార్డులలోకి వాననీరు వచ్చిచేరడంతో రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బంది నానాపాట్లు పడాల్సి వచ్చింది. పలు వార్డుల్లోకి వరద నీరు వచ్చిందని, దీనితో తాము దిక్కుతోచనిస్థితిలో పడ్డామని రోగులు తెలిపారు. ప్రత్యేకించి కాన్పులకు వచ్చిన గర్బిణీలు, నడువలేని స్థితిలో ఉన్న రోగులు, ఆపరేషన్ థియేటర్లలోని వారికి ఈ వరదలు నరకం చూపిస్తున్నాయి. పల్లపు ప్రాంతాలలో ఉన్న ఆసుపత్రుల్లో వరదను అరికట్టేందుకు అధికారులు యత్నిస్తూ ఉన్నా ఫలితం లేకుండాపోతోంది.
- Advertisement -