Thursday, January 23, 2025

వరద నీటి కాల్వ పనులు త్వరగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ:వరద నీటి కాల్వపనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ. రమణాచారి సిబ్బందిని ఆదేశించారు.శుక్రవారం 32వ వార్డులోని రాక్హిల్స్ కాలనీలోరూ. 2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వరద నీటి కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత కాంట్రాక్టర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

స ంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పనులను పర్యవేక్షించాలని సూచించారు. నాణ్యతతో పాటు పను లు చేయాలని, నాణ్యతలో ఎలాంటి లోపం ఉన్నా బిల్లులు రికార్డు చేయవద్దని సంబంధిత ఇంజనీర్లకు సూచించారు. శానిటేషన్ వర్కర్లతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీట్ మా ర్కెట్‌లో గల ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కన్స్ట్రక్షన్ పనులు త్వరగా పూర్తిచేసి సెప్టెంబర్ వ రకు కంప్లీట్ చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీర్లను ఆదేశించారు.

అనంతరం హరిత శుక్రవారం కార్యక్రమంలో భాగంగా వార్డ్ నెంబర్ 48 లో గల చింతల పార్క్ లో మొక్కలు నాటారు. మొక్కలను రక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, మున్సిపాలిటీ ఈఈ రాములు, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఏసీబీ నాగిరెడ్డి, మున్సిపాలిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ దిలీప్, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నాగరాజ్, హరితహారం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News