Thursday, January 23, 2025

గాంధీ స్మారకానికి వరద విముక్తి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గాంధీజీ ఢిల్లీ వరద నీటి నుంచి విముక్తి పొందారు. రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారక స్థలి ఇటీవలి యమునా వరదలతో పూర్తిగా జలమయం అయింది. ఈ క్రమంలో ఇక్కడ బాపూజీ సమాధి ఇతర స్మారకాలు నీట మునిగి రోజుల తరబడి ఉండాల్సి వచ్చింది. ఈ నీటిని పంపులతో పూర్తి స్థాయిలో తోడివేశారు. ఈ స్మారకస్థలి లాన్స్, రాదారి వెంబడి భారీ స్థాయిలో నిలిచిన వరద నీరును తీసివేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ నీటి తీసివేత కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించిన లెప్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా రాజ్‌ఘాట్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. నీటిని పూర్తిగా తొలిగించి ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసినట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో మునుపటి పరిస్థితి నెలకొనే వరకూ అధికారులు ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. పది పంపులను వాడి నీటిని నాలుగయిదు రోజులకు పూర్తిగా తీసివేయగలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News