Tuesday, November 5, 2024

నీట మునిగిన భద్రాద్రి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాచలంలోని రామాలయం పడమర మెట్ల వద్దకు వర్షపు నీరు చేరింది. ఆ ప్రాంతంలో సుమారు 35 దుకాణాలకు వరద నీరు చేరడంతో సామగ్రి మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయింది. పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీ, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీలలోని పలు ఇళ్లు నీటమునిగాయి. రామాలయం ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరి అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్ పూర్తిగా జలమయం అయింది. దీంతో తెల్లవారుజాము నుంచి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంచాయతీ కార్యాలయం ప్రాంతంలో నీరు రోడ్ల పైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాటు దుమ్ముగూడెం, చర్ల మండాలలోని పలుచోట్ల వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి నుండి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

హరినాధ బాబా ఆలయం వద్ద కుంగిన కల్యాణ మండపం
భద్రాచలంలోని హరినాధ బాబా ఆలయం వద్ద కొండపై కల్యాణ మండపం కుంగిపోయింది. మండపం కింద కొండను తవ్వడం వల్ల కుంగిపోయినట్లు సమాచారం. భారీ వర్షాల వల్ల కల్యాణ మండపం కిందకు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 1938లో హరినాధబాబా ఆలయం నిర్మించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై మంత్రి తుమ్మల ఆరా తీశారు. ఆ ప్రాంతానికి వెళ్లి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో హరినాధ బాబా ఆలయం కల్యాణ మండపాన్ని కలెక్టర్, ఇతర అధికారులు పరిశీలించారు. కొండ కింద ఉన్న ఇళ్లు దుకాణాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు రామాలయం వద్ద అన్నదాన సత్రంలోకి వర్షపు నీరు చేరింది. దీంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. పడమర మెట్ల వద్ద వర్షపు నీట వల్ల నిలిచి ప్రయాణాలకు అంతరాయం కలిగింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News