Thursday, November 21, 2024

శ్రీశైలంకు లక్ష క్యూసెక్కులు.. ప్రమాదస్థాయికి గోదావరి

- Advertisement -
- Advertisement -

ప్రమాదస్థాయికి గోదావరి.. భద్రాచలం వద్ద 43అడుగులు
ఉదయానికి మరింత పెరిగే అవకాశం: సిడబ్యుసి
దుమ్ముగూడెం వద్ద 9.01లక్షల క్యూసెక్కులు
బిరబిరా కృష్ణమ్మ .. శ్రీశైలంకు లక్ష క్యూసెక్కులు
వేగంగా నిండుతున్న జలాశయాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర , కర్ణాటక చత్తిస్‌గఢ్ , ఒడిశా ప్రాంతాలో కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఉన్న వాటి ఉపనదులు వరదనీటితో గట్లు తన్నుకుని ప్రవహిస్తున్నాయి.. గోదావరి నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ఆదివారం సాయత్రం భద్రాచలం వద్ద నీటిమట్టం 43అడుగులకు చేరింది. కలెక్టరర్ జితేష్ పాటిల్ మొదటి పమాదహెచ్చరికను జారీ చేశారు.

గోదావరి పరిహాకంగా ఎడతెరిపిలేని వర్షాలతో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర జలవనరుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో సోమవారం ఉదయానికి గోదావరిలో నీటమట్టం 48అడుగులకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. నదికి ఇరువైపులా పరివాహక గ్రామాలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాణహిత నదిద్వారా భారీగా వరదనీరు మేడిగడ్డకు చేరుతోంది.దీంతో ఈ బ్యారేజి వద్ద వరద ప్రవాహం 5.52లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ఎగువన కూడా అన్నారం బ్యారేజికి 16870క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో బ్యారేజిలో మొత్తం 66గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

దిగువన తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజి మీదుగా 8.23లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. మొత్తం 59గేట్ల ద్వారా వరదనీటిని దిగువకు వదులుతున్నారు. దుమ్ముగూడెం వద్ద నదిలో వరద ప్రావాహం 9.19లక్షల క్యూసెక్కులకు పేరిగింది. మరోవైపు దిగువన శబరి నదిలో వరదనీటి మట్టం 28అడుగులు పెరిగింది. శబరి వరదప్రవాహం గోదావరిలో కలుస్తుండటంతో భద్రాచలం వద్ద వరనీరుపోటేస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 18518క్యూసెక్కుల నీరు చేరుతుండగా , ప్రాజెక్టులో నీటినిలువ 16.19టిఎంసీలకు చేరింది. శ్రీపాద ఎల్లంపల్లిలో కూడా నీటినిలుల 7.88టిఎంసీలకు పెరిగింది. కడెం ప్రాజెక్టులోకి 8785క్యూసెక్కుల నీరు చేరుతుండగా, గేట్లు తెరిచి 14229క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు.

బిరబిరా కృష్ణమ్మ ..శ్రీశైలంకు లక్ష క్యూసెక్కులు:
ఎగువన జూరాల ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. అన్ని గేట్లు తెరిచి వేయటంతో కృష్ణమ్మ భారీ వదరప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి పరుగులు పెడుతోంది. ఎగువనుంచి జలాశయంలోకి లక్షక్యూసెక్కుల నీరు చేరుతోంది.శ్రీశైలలో నీటినిటిలువ 41.70టిఎంసీలకు చేరుకుంది. కర్ణాటకలో తుంగభద్ర ప్రాజెక్టు గరిష్టస్థాయికి చేరవవుతోంది. ఎగువ నుంచి రిజర్వాయర్‌లోకి 1.11లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టులో నీటినిలువ గరిష్టస్థాయికి చేరువలో 80టిఎంసీలకు పెరిగింది. ఇటు అల్మట్టిలోకి 1.24లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా గేట్ల ద్వారా 1.50లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయం కూడా గరిష్టస్థాయికి చేరటంతో ఎగువ నుంచి వస్తున్న 1.25లక్షల క్యూసెక్కులతో కలిపి మొత్తం 1.45లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు .కృష్ణాకు ఉపనదిగా ఉన్న భీమా నదిలో కూడా వరద ఉధృతి పెరిగింది.యాదగిరి జిల్లాలోని భీమా నదీతీర లోతట్టున ఉన్న 80గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News