Thursday, January 9, 2025

వందేళ్ళ చరిత్రలో కృష్ణానదికి అతిపెద్ద వరద

- Advertisement -
- Advertisement -

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ నది ఉగ్రరూపం దాల్చింది. వందేళ్ళ చరిత్రలో కృష్ణానదికి ఇదే అతిపెద్ద వరదగా చెబుతున్నారు. సోమవారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కలు కాగా రాత్రికి 12 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇది పెరిగితే బ్యారేజి పటిష్టతకు భంగం కలిగే ప్రమాధం ఉండటంతో సాగునీటి శాఖ నిపుణుల పర్యవేక్ష్లణలో వరద నియంత్రణ కొనసాగుతోంది. కాగా కృష్ణా పైన ఉన్న అన్ని డ్యాంలు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతుండగా మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుత నీటి మట్టం 24.4 అడుగుల వద్ద కొనసాగుతోంది. కాగా ఈ సమయంలో విజయవాడను అమావాస్య గండం వెంటాడుతుంది.

ప్రస్తుత అమావాస్య కావడంతో సముద్రం పోటు మీద ఉందని, ఈ కారణంగా విజయవాడ బ్యారేజీ నుంచి వదిలిన నీటిని సముద్రం తనలో కలుపుకోకపోవడంతో వరద కృష్ణానదిలో అలాగే స్థిరంగా కొనసాగుతోంది. దిగువ కృష్ణానదిలో అలాగే ఉండిపోయిన నీరు నీరు లంక గ్రామాల వైపు మళ్లే ప్రమాదం పొంచి ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటి ఉధృతి కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే సమీపంలో ఉండే మూడు బోట్లు వేగంగా కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజి గేట్లను బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో డ్యామ్ గేట్ల ప్రాతంలోని ఓ భాగం పాక్షికంగా ధ్వంసమైంది. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో వరద ఉధృతిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మరికొన్ని గంటలకు 12 లక్షల క్యూసెక్కుల దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వరద నీటిని విడుదల చేయడంతో బ్యారేజి పైనుంచి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపి వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News