Friday, December 20, 2024

ముంపు కాలనీ వాసులకు నష్ట పరిహారం ఇవ్వాలి: అంజన్‌ కుమార్ యాదవ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :నగరంలో వరద ముంపు కాలనీ వాసులకు నష్ట పరిహారం ఇవ్వాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్ కుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం వరద సమస్యలపై జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డల్లాస్ ఎక్కడ వుందని అడిగితే కమిషనర్ సీరియస్‌గా వెళ్ళిపోవడం సిగ్గుచేటని మంత్రి కెటిఆర్ ఏమి చెప్పకపోవడంతో కమిషనర్ ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు.

అనంతరం పిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి ప్రసంగిస్తూ ముంపు ప్రాంతం వాసులకు నిత్యావసర వస్తువులను అందించాలని కమిషనర్‌ను కోరారు. నగరానికి సముద్రాన్ని తీసుకువచ్చిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీకే దక్కిందన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఫుడ్ పాకెట్స్ పంపిణీ చేయలేదని, వరద బాధితులకు రూ. 15 వేలు సహాయం అందించాలని సూచించారు. వానలకు రోజు వారీ కూలీలకు పని దొరకడం లేదని వారికి ఉపాధి అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. అదే విధంగా కార్పొరేటర్ విజయారెడ్డి మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీలో నీరు చేరిందని దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News