Thursday, December 26, 2024

షరతుల్లేని తక్షణ సాయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మానవీయ కోణంలో ఆలోచించి రాష్ట్రానికి వరద సా యం చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి కేంద్ర బృందాన్ని కోరారు. రాష్ట్రంలో భారీ వ ర్షా లు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో వరదల వల్ల జరిగిన నష్టం గురించి సిఎం వివరించారు. ఇటీవ ల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీ వ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో సచివాలయంలో శుక్రవారం సిఎం రేవంత్‌రెడ్డి స మావేశమయ్యారు. ఈ సమావేశంలో రెవె న్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపి రఘురాం రెడ్డి, సిఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సిఎస్ శాంతికుమారి, ఇ తర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన వరద నష్టం గురించి కేంద్ర బృందానికి మంత్రులు వివరించారు. ఎక్కడెక్కడ నష్టం తీవ్రంగా జరిగిందో వివరించారు. పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల గురించి వివరించడంతో పాటు ఆస్తినష్టం జరిగిన తీరును కూడా కేంద్ర బృందానికి వారు సవివరంగా తెలిపారు. వరదలతో తీ వ్రంగా నష్టపోయిన తెలంగాణకు ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని సిఎం రేవంత్ కో రారు. వరదల శాశ్వత పరిష్కారానికి కేం ద్ర వద్ద యాక్షన్ ప్లాన్ ఉండాలని సిఎం సూచించారు.తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఎన్డీఆర్‌ఎఫ్ లో అందుబాటులో ఉన్న రూ.1,350 కోట్లల్లో ఒక్క రూ పాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేంద్ర అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే, కేవలం ఒక లక్ష రూపాయలు తరువాయి 6లో
(మొదటిపేజీ తరువాయి)
ఖర్చు చేయాలని రేట్లకు నిర్ణయించారని, దీంతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని ముఖ్యమంత్రి అన్నారు.

లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది
ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీగా ప్రాణనష్టం తగ్గిందని చెప్పారు. వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంత నష్టపోయారన్నారు. చాలా చోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు, చెర్వులు కొట్టుకుపోవటంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని సిఎం కేంద్రబృందానికి వివరించారు.

పోలీసు బెటాలియన్‌లను ఉపయోగించుకుంటాం
భవిష్యత్‌లో వరదలు వచ్చినప్పుడు ఆదుకునేందుకు, తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పోలీసు బెటాలియన్‌లను ఉపయోగించుకుంటామని సిఎం తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు. ప్రతి బెటాలియన్‌లో ఎంపిక చేసిన వంద మందికి ప్రత్యేక శిక్షణను అందిస్తామని అన్నారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం నేర్పేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సాయం కోరుతున్నామన్నారు. మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన సమావేశంలో చర్చకు వచ్చింది. అటవీ ప్రాంతంలో జరిగినందున ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగితే భారీ ప్రమాదం వాటిల్లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం అభిప్రాయపడింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి కోరారు. అలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సిఎం అధికారుల బృందానికి సూచించారు.

వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలి
ఖమ్మం జిల్లా మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడం వల్ల అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారం కల్పించవచ్చని సిఎం వారితో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలను సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లను కేటాయిస్తామని సిఎం చెప్పారు. ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో భవిష్యత్‌లో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కేంద్ర బృందాన్ని సిఎం కోరారు.

శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం కార్యాచరణ చేపట్టాలని కేంద్ర బృందానికి సిఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర బృందం అంతకు ముందు తెలంగాణలో వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసింది. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర రెవెన్యూ అధికారులతో చర్చించిన కేంద్ర బృందానికి రాష్ట్రంలో జరిగిన ఆస్తినష్టం, పంట నష్టం గురించి మంత్రి పొంగులేటి తెలియజేశారు. ఏయే ప్రాంతాల్లో వర్షాలు, వరదలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందో మంత్రి పొంగులేటి అధికారుల బృందానికి వివరించారు. మానవీయ కోణంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వయిజర్ కల్నల్ కెపి సింగ్ నేతృత్వంలో….
సెప్టెంబర్ మొదటివారంలో తెలంగాణను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో వరద నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయడానికి స్వయంగా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇది వరకే ఏరియల్ సర్వే చేయగా గురువారం ఆరుగురు సభ్యులు గల కేంద్ర బృందం రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ నేపథ్యంలోనే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వయిజర్ కల్నల్ కెపి సింగ్ నేతృత్వంలోని కేంద్ర బృందం క్షేత్ర స్థాయి పర్యటన పూర్తి చేసుకొని శుక్రవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో భేటీ అయ్యింది.

కాగా, రాష్ట్రంలో జరిగిన వరద నష్టం అంచనా వేయడానికి శుక్రవారం సచివాలయంలో కేంద్ర బృందంతో సిఎం రేవంత్ రెడ్డి తో సహ మంత్రుల బృందం సమావేశం అయిన నేపథ్యంలో పలు అంశాలను వారు కేంద్ర బృందంతో చర్చించారు. అయితే కేంద్ర బృందం ఇచ్చే నివేదికల ఆధారంగా విపత్తు సాయాన్ని అందిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలో హామీ ఇవ్వగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన తీవ్ర వరద నష్టాలపై తక్షణ సహాయక చర్యల కింద తెలంగాణ, ఎపికి కలిపి రూ.3,300 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News