Thursday, September 19, 2024

గుజరాత్‌లో దంచి కొడుతున్న వానలు.. 28 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లో వర్షాలు బీభత్సం సృస్టించాయి. ఏక ధాటిగా వర్షాలు దంచికొడుతుండటంతో గుజరాత్ అల్లకల్లోలం అయ్యింది. గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఇప్పటివరకు గుజరాత్ లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.  మోర్బి జిల్లా హల్వాద్ తాలూకా పరిధిలోని ధావానా గ్రామ సమీపంలో పొంగిపొర్లుతున్న కాజ్‌వేను దాటుతుండగా ట్రాక్టర్ ట్రాలీ కొట్టుకుపోవడంతో ఏడుగురు మృతి చెందారు.

వడోదరలోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. నగరం గుండా ప్రవహించే విశ్వామిత్ర నది ఉధృతంగా ప్రవహించడంతో శివారు నివాస ప్రాంతాలలోకి వరద ప్రవేశించి, భవనాలు, రోడ్లు, వాహనాలను ముంచెత్తాయి. ఇక, సౌరాష్ట్ర ప్రాంతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేవభూమి ద్వారక, జామ్‌నగర్, రాజ్‌కోట్, పోర్‌బందర్ జిల్లాల్లో 12 గంటల వ్యవధిలో 50 మి.మీ నుండి 200 మి.మీ వరకు వర్షం పడింది.

దేవభూమి ద్వారక జిల్లాలోని భన్వాడ్ తాలూకాలో 185 మి.మీ నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 17,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో గురువారం కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News