Monday, December 23, 2024

హిమాచల్, ఉత్తరాఖండ్‌లో ముంచెత్తిన వరదలు

- Advertisement -
- Advertisement -

Floods in Himachal and Uttarakhand

కొట్టుకు పోయిన రైలు వంతెన
కొండచరియలు విరిగిపడి, వరదల్లో 20 మంది మృతి, పలువురు గల్లంతు
ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి
కట్టలు తెంచుకున్న నదులు, కొట్టుకు పోయిన వంతెనలు
ఇళ్లలోకి బురద ప్రవాహం
పలుగ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

సిమ్లా/డెహ్రాడూన్/ శ్రీనగర్: ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్‌ప్రదేశ్. ఉత్తరాఖండ్, జమ్మూ, కశ్మీర్‌లలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడిన వేర్వేరు ఘటనల్లో 20 మందికి పైగా మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 15 మంది చనిపోగా, పలువురు గల్లంతయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన వేర్వేరు ఘటనల్లో కనీసం 15మంది మృతి చెందగా, మరో 8మంది గల్లంతయ్యారు.

హామీపూర్ జిల్లాలో ఆకస్మికంగా వచ్చిన వరదలో చిక్కుకుపోయిన 22 మందిని అధికారులు రక్షించారు. భారీ వర్షాల కారణంగా కంగ్రా జిల్లాలో ఓ రైల్వే వంతెన కుప్పకూలింది. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లను కలుపుతూ చక్కీ నదిపై నిర్మించిన ఈ వంతెనకు చెందిన ఒక పిల్లర్ భారీ వరద కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో రైల్వే వంతెన కుప్పకూలింది.దీంతో వందలాది గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కంగ్రా, కులు, మండి, ధర్మశాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ధర్మశాలలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండి జిల్లాలో శనివారం ఉదయం ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇళ్లు, దుకాణాలను వరదనీరు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 15మంది చనిపోయారు. మరో 8 మందికి పైగా గల్లంతయ్యారు. వారు చనిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మండి జిల్లాలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డంతో ముగ్గురు చనిపోయారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

మండి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డంతో పాటుగా వరదల్లో ఒక బాలిక చనిపోగా, ఆమె కుటుంబానికి చెందిన మరో అయిదుగురు కొట్టుకు పోయారు. బాలిక మృతదేహం ఆమె ఇంటికి అరకిలోమీటరు దూరంలో లభ్యమయింది. కషన్ గ్రామంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది శిథిలాల కింద చిక్కుకు పోయి చనిపోయారు. అయితే వారి మృత దేహాలను ఇంకా వెలికి తీలేదని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి జైరాం రమేశ్ ప్రాణనష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు యుద్ధ పాంరతిపదికపై సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి, కొట్టుకుపోయిన వంతెనలు

ఉత్తరాఖండ్‌లో శనివారం తెల్లవారుజామున ఒక గ్రామంలో కుంభవృష్టి కురిసింది. దీంతో పలు నదులు పొంగి ప్రవహించడంతో అనేక వంతెనలు కొట్టుకు పోయాయి. టోన్స్ నదికి వరద రావడంతో నది ఒడ్డున ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం తపకేశ్వరాలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. రాయ్‌పూర్ ప్రాంతంలోని సర్‌ఖేత్ గ్రాంలొ తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఈ కుండపోత వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. దీంతో థానో సమీపంలో సోంగ్ నదిపై వంతెన కొట్టుకుపోయింది. ముస్సోరి సమీపంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమయిన కెంప్టీ జలపాతం కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తోందని వారు చెప్పారు.

ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధిత ప్రాంతాలను సందర్శించి వాహనాల రాకపోకల పునరుద్ధరణ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.అవసరమైతే సైన్యం సాయాన్ని కూడా తీసుకుంటామని చెప్పారు. కుండపోత వర్షాల కారణంగా డజనుకు పైగా గ్రామాల్లోని ఇళ్లలోకి బురద వచ్చి చేరడంతో అధికారులుబాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడ్డంతో హృషీకేశ్‌బద్రీనాథ్ హైవే తోటాహాటి వద్ద మూసుకుపోయింది. అలాగే నగ్ని వద్ద హృషీకేశ్ గంగోత్రి హైవేపై కూడా పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News