Monday, December 23, 2024

బ్రెజిల్ వరదల్లో 117 మంది మృతి

- Advertisement -
- Advertisement -
floods kill at least 117 in Brazil
మరో 116 మంది గల్లంతు

పెట్రోపోలిస్(బ్రెజిల్): పెట్రోపోలిస్ పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు, కొండ చరియలు విరిగిపడిన సంఘటనల్లో మరణించిన వారి సంఖ్య 117కు పెరిగింది. మరో 116 మంది ప్రజల ఆచూకీ తెలియరావడం లేదని స్థానిక అధికారులు శుక్రవారం తెలిపారు. రియో డి జనీరో నగరానికి సమీపంలో పర్వతాల మధ్య ఉన్న మెట్రోపోలిస్ పట్టణాన్ని గత మంగళవారం భారీ వర్షాలు ముంచెత్తాయి. కొండ చరియలు విరిగిపడడంతో అనేక మంది మృత్యువాత పడినట్లు రియో డి జనీరో ప్రభుత్వం ధ్రువీకరించింది. భారీ వరదల్లో కార్లు, ఇళ్లు కొట్టుకుపోయాయి. పొంగిప్రవహిస్తున్న నదిలో రెండు బస్సులు మునిగిపోతుండగా ఆ బస్సుల్లోని ప్రయాణికులు కిటికీల నుండి బయటపడి సురక్షితంగా ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. కొందరు ఒడ్డుకు సురక్షితంగా చేరుకోగా మరి కొందరు నదిలో కొట్టుకుపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News