Wednesday, January 22, 2025

మేఘాలయలో భారీ వర్షాలు.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మేఘాలయలో భారీ వర్షాలు విషాదం నింపాయి. గారో హిల్స్‌లోని ఐదు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సౌత్ గారో హిల్స్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో భారీ వరదలు గ్రామాలను ముంచెత్తాయి. సౌత్ గారో హిల్స్ ప్రాంతం వరదలతో అల్లాడిపోతోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన సంఘటనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు.

హతియాసియా సాంగ్మా అనే మారుమూల గ్రామంలో శనివారం కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని వారు తెలిపారు. గారో హిల్స్ ప్రాంతంలో వర్షాల కారణంగా మొత్తం 10మంది మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. గసువాపరా ప్రాంతంలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో కొండచరియలు విరిగి పడటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గారో హిల్స్‌లోని ఐదు జిల్లాల్లో పరిస్థితిపై ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ వర్షాలకు దాలు ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, హతియాసియా సాంగ్మాకు చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో వారి మృతి పట్ల సిఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుబుంబాలకు తక్షణమే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్‌లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డిఆర్‌ఎఫ్), ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News