ఒక్కసారి సగానికి సగం పెరిగిన కేసులు
ఫోర్ట్‌లాడెర్‌డేల్ ( అమెరికా): ఫ్లోరిడాలో కరోనా మహమ్మారి చెలరేగుతోంది. గత వారం కన్నా కేసులు అమాంతంగా 50 శాతం రెట్టింపు పెరిగాయి. గత వారం ఒక్కసారి కేసులు అంతకు ముందు వారం కన్నా 1,10,000 వరకు పెరిగాయి. అంతకు ముందు 73,000 వరకు కేసులు ఉండేవి. జూన్ 11 నాటికి 10,000 వరకు కేసులు ఉండగా, దానికి 11 రెట్లు కేసులు పెరిగినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య విభాగం పేర్కొంది. వ్యాక్సిన్లు అందక ముందు గత జనవరిలో ఏ స్థాయిలో కేసులు ఉండేవే అదే స్థాయిలో ఇప్పుడు కేసులు పెరిగాయని వివరించింది.
నెలరోజుల క్రితం 1845 మంది ఆస్పత్రి పాలవ్వగా, ఇప్పుడు 9300 మంది ఆస్పత్రి పాలయ్యారని పేర్కొంది. జులై 23 నాటికి రికార్డు స్థాయిలో 10,179 మంది ఆస్పత్రి పాలయ్యారని వివరించింది. ఈవారం 409 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 39,000 కు చేరుకుంది. గత ఏడాది ఆగస్టు మధ్యలో ఏడు రోజుల కాలంలో 1266 మంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో వచ్చేనెల నుంచిస్కూళ్లు తెరుచుకోనున్నందున విద్యార్ధులు కానీ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది మాస్క్‌లు ధరించ వలసిన అవసరం లేదని, అలాగే మాస్క్‌ల వల్ల కరోనా నుంచి రక్షణ కలుగుతుందనడానికి ఆధారాలు లేవని గవర్నర్ రాన్ డిశాంటిస్ ప్రకటించిన తరువాత కరోనా వివరాలు బయటపడడం గమనించ వలసిన విషయం.