Sunday, January 19, 2025

ప్రేయసికోసం స్పీడెక్కిన మనసుతో…

- Advertisement -
- Advertisement -

Florida man drives at 180 kph in emergency lane to impress girlfriend

గంటకు 190 కిలోమీటర్ల యమ వేగం

ఫ్లోరిడా : అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ 19 ఏండ్ల యువకుడు ప్రియురాలిని ఆకట్టుకునేందుకు కారును గంటకు 190 కిలోమీటర్లు వేగంతో పోనిచ్చాడు. పైగా ఎమర్జెన్సీ లేన్‌లో వాహనం రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది. తన ప్రియురాలి మనసు గెల్చుకునేందుకు తాను ఎటువంటి తప్పిదం అయినా చేస్తానని రాంగ్ రూట్‌లో కారు నడపటం ఓ లెక్కలోకి రాదని ఈ యవకుడు అంగిలో డానెలి స్పష్టం చేశారు. అసలే రాంగ్ సైడ్ .. కేవలం అత్యయిక సేవల వాహనాలు వెళ్లాల్సిన రాదారి. దీనికి తోడు అంతరాష్ట్ర హైవే మీదుగా ఛేజింగ్ స్థాయిలో ఈ యవకుడు దూసుకువెళ్లాడు. తాను ప్రేమించే యువతి దృష్టిలో పడటమే తన ముందున్న లక్షం అని, దీనిని పరిగణనలోకి తీసుకునేతాను కారు నడిపానని పోలీసులు వెంటాడి పట్టుకున్న తరువాత ఈ వ్యక్తి చెప్పాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News