Monday, December 23, 2024

రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేము

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేమని నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ బిగాల గణేష్ గుప్తా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లోగల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద గురువారం అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, మేయర్ దండు నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాలు అమరుల స్థూపానికి పూలదందలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు గత 21 రోజులుగా సాగుతున్నాయన్నారు. దశాబ్ది ఉత్సవాల చివరి రోజు అమరు సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమరుల త్యాగాలు ఎప్పుడు గుర్తిండిలా హైదరాబాద్ సెక్రెటేరియట్ ఎదుట అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేమన్నారు. సిఎం కెసిఆర్ పాలనలలో తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ సాధించుకున్న విజయాలకు గుర్తు చేసుకోవాలన్నారు. 2014కు ముందు ప్రస్తుతం తెలంగాణాలో జరిగిన అభివృద్ధిని బిఆర్‌ఎస్ కార్యకర్తలు గ్రామాల్లో వారికి వివరించాలన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ దిశా, నిర్దేశంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. అదే విధంగా సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సుఖ, శాంతులతో జీవిస్తున్నారన్నారు. దసరా, దీపావళి పండగల ఒకరోజు ముందు మాత్రమే వస్తుందని కానీ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు 22రోజులపాటు కొనసాగుతున్నాయన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజు సందర్భంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవటం సంతోషదాయకమన్నారు.

తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ అమరుల స్థూపానికి నివాళులర్పించామన్నారు. లోకల్‌బాడీ సమావేశాలు నిర్వహించి గ్రామ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాలోల ప్రత్యేక సమావేశం నిర్వహించి అమరుల త్యాగాలను స్మరించుకుంటామన్నారు. జిల్లాలోని పాఠశాలలో అమరులను స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News