Saturday, December 28, 2024

షబ్ ఏ భారత్…నగరంలో ఫ్లైఓవర్లు మూసివేత

- Advertisement -
- Advertisement -

ఆదేశాలు జారీ చేసిన జాయింట్ సిపి ఎవి రంగనాథ్

Fly Overs closed in shab a bharath

మనతెలంగాణ, సిటిబ్యూరో: నగరంలోని షబ్ ఏ భారత్ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లను ఈ నెల 18 లేదా 19వ తేదీ రాత్రి 10 గంటలకు మూసివేయనున్నట్లు హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. పివిఎన్‌ఆర్ మార్గ్ లేదా నక్లెస్ రోడ్డును కూడా మూసివేయనున్నట్లు పేర్కొనారు. గ్రీన్ ల్యాండ్ ఫ్లైఓవర్, పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేకు మినహాయింపు ఉందని తెలిపారు. షబ్ ఏరా భారత్ సందర్భంగా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News