Monday, December 23, 2024

శివరాత్రి, జగ్నేకీ రాత్ సందర్భంగా ఫ్లైఓవర్లు మూసివేత!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహాశివరాత్రి, షబ్‌-ఎ-మెరాజ్(జగ్నేకీ రాత్) దృష్ట్యా  నగరంలో అనేక ఫ్లైఓవర్లను మూసేయనున్నారు. గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్, పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, లంగర్ హౌజ్ మినహా నగరంలోని ఇతర ఫ్లైఓవర్లను శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మూసేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పౌరులు ఆంక్షలను గమనించి, ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సాయం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించాలని తెలిపారు.

Hyd Traffic Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News