Monday, December 23, 2024

తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

FNCC Vizag president KS Rama rao comments

 

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వైజాగ్ అధ్యక్షుడిగా నన్ను తొలగించినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ “- ఎఫ్‌ఎన్‌సిసి వైజాగ్‌లో రూ 30 కోట్లు నిధులు దుర్వినియోగం అయ్యాయని అనడం కూడా అవాస్తవం. కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. – ఎఫ్‌ఎన్‌సిసి వైజాగ్‌కు గత ప్రభుత్వాలు రెండు చోట్ల స్థలాలు ఇచ్చాయి. ఆ స్థలాన్ని అభివృద్ధి పనుల కోసం మాకు అప్పగించడంలో ఇప్పటి ఏపి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. అయితే ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం అక్కడ నటీనటులకు స్థిర నివాసం, స్టూడియో ఏర్పాట్లకు సహకరిస్తామని సిఎం జగన్, మంత్రి పేర్ని నాని ప్రోత్సాహాలు ప్రకటించారు. ఇలాంటి తరుణంలో తప్పుడు వార్తలు రావడం సినిమా అభివృద్ధికి ఆటంకమే”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News