Wednesday, November 6, 2024

మోడీ బైడెన్ మధ్యలో చైనాయన..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఇటీవల ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షులు జో బైడెన్ మధ్య ఓవల్ అధికార కార్యాలయంలో చైనాపైనే ఎక్కువగా చర్చలు జరిపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఇప్పుడు తెలిపాయి. గత నెల చివరిలో భారత ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఇరువురు నేతల మధ్య బహుళ స్థాయి చర్చలు జరిగాయి. అయితే ఇందులో ఎక్కువ సమయం చైనా, ఈ దేశ అధినేత జి జిన్‌పింగ్‌పైనే కేంద్రీకృతం అయిందని వివరించారు. తమకు జిన్‌పింగ్‌తో ఉన్న చిరకాల అనుభవాల గురించి ముచ్చటించుకున్నారు.

ఆయనతో మిత్రత్వం గురించి విశ్వ ప్రయత్నం చేసి, ఆశలు వదులుకున్న వైనాన్ని గుర్తు చేసుకున్నారు. గత నెల 21 నుంచి 23 వరకూ మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ దశలో మోడీ బైడెన్ మధ్య రోజూ చర్చలు జరిగాయి. చైనా వ్యవహారం తమకు కొరకరాని కొయ్య అయిందని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన దశలో బైడెన్‌తో కలిసి ఎనిమిది గంటలు ఉన్నారు. ఇది ఇరుదేశాల మధ్య అధికారికంగా కుదిరిన పలు ఒప్పందాలను మించి చైనాపై lలోపాయికారి అవగావహనలకు దారితీసిందని ఇప్పుడు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News