Monday, December 23, 2024

అంతరాష్ట్ర వాహనాలపై దృష్టి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లా కేంద్రం గుండా వివిధ రాష్ట్రాలకు నిత్యం వేలాదిగా భారీ వాహనాలు నడుస్తున్నాయని, వాటి రాకపోకలను క్రమబద్దీకరిస్తే రోడ్డు ప్రమాదాలను వందశాతం నివారించే అవకాశాలు ఉంటాయని ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి మీదుగా బైపాస్ రహదారి లేకపోవడం వల్ల రాజీవ్ రహదారి మీదుగా వాహనాలు రద్దీ ఎక్కువగా ఉందని, దీని వల్ల ప్రమాదాలకు కూడా పెరుగుతున్నాయని తెలిపారు.

ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య పెద్దగా లేదని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. దుకాణదారులు వారి వ్యాపార సముదాయాల ముందు వాహనాలను క్రమపద్దతిలో నిలిపేలా చూసుకోవాలని, పార్కింగ్ నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామని తెలిపారు.

వాహనదారులు వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్ల చేతికి బండ్లు ఇస్తే వారి స్వంతదారులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలని కోరారు. పెద్దపల్లి పరిధిలో ఏ ట్రాఫిక్ సమస్య తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News