మనతెలంగాణ/హైదరాబాద్ : 17 ఎంపి సీట్లలో 12కు తగ్గకుండా గెలిపించుకోవాలని సిఎం, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియోజకవర్గాల నాయకులకు, మంత్రులకు సిఎం సూచించారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసిఆర్‌హెచ్‌ఆర్డీ లో కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమీక్ష సమా వేశం లో ఆయన ప్రసగించారు. సోమ, మంగళవారాల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల జిల్లా ఇన్‌చార్జీలతో క లిసి ఆయన పార్టీ వ్యూహాలపై చర్చించనున్నారు. సోమవారం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో ఆదిలాబాద్, నిజామాబా ద్, మెదక్, మహబూబ్‌నగర్,నాగర్‌కర్నూల్, సికింద్రా బాద్, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.
26వ తేదీ తరువాత జిల్లాల పర్యటనకు సిఎం
ఈ సమీక్షలో భాగంగా బిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పా ర్టీల బలాబలాలను సిఎం రేవంత్ నాయకులను అడిగి తె లుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. జరగనున్న పార్లమెం ట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యుహాలపై ఆయనతో చర్చించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని నాయకులకు సిఎం సూచించారు. ఈ నెల 26వ తేదీ తరువాత జిల్లాల పర్యటనకు సిఎం రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించారు. ఈ సభ నేపథ్యంలో ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు ముఖ్యమంత్రి సూచించారు.
ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటాం
ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని సిఎం రేవంత్ ఈ సందర్భంగా నేతలకు హామీనిచ్చారు. సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని సిఎం భరోసా ఇచ్చారు. తాను గత సిఎంలా కాదని ముఖ్యమంత్రి రేవంత్ వారితో పేర్కొన్నారు. జనవరి 26 వ తేదీ తరువాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని ఆయన హామీనిచ్చారు. వారానికి మూడు రోజులు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని సిఎం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహం తో పని చేయాలని నేతలకు సిఎం సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేశారు.
ఉమ్మడి జిల్లాల వారీగా సిఎం సమీక్షలు
ప్రస్తుతం ఆదిలాబాద్ ఇన్‌చార్జిగా మంత్రి సీతక్క, నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జీ జూపల్లి కృష్ణారావు, మెదక్ జిల్లా ఇన్‌చార్జీ కొండా సురేఖ, మహబూబ్‌నగర్ ఇన్‌చార్జీ దా మోదర రాజనర్సింహ, హైదరాబాద్‌కు పొన్నం ప్రభాకర్ ఇన్‌చార్జీలుగా వ్యవహారిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించే సమీక్షా సమావేశంలో ఇన్‌చార్జీలందరూ పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాల వారీగా వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి, ఆయా నియోజకవర్గాల తాజా రాజకీయ పరిస్థితులపై సిఎం ఆరా తీస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గత పాలనలో అభివృద్ధికి ఆమడదూరం: మంత్రి సీతక్క
సమీక్ష అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడు తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గత పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, మిగతా ప్రాంతాలకు దీటుగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేస్తామని టిపిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి సీతక్క వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న కాం గ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులు, ఇతర ప్రజా ప్రతినిధులతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. జనవరి 26వ తేదీ తర్వాత మొదటి పర్యటనగా ఇంద్రవెల్లికి సిఎం వస్తారని ఆమె పేర్కొన్నారు. గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులు తమ నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ఎజెండాను తయారు చేసుకోవాలని సిఎం సూచించారన్నారు. బిఆర్‌ఎస్ నేత లు పదవులు లేకపోయే సరికి తట్టుకోలేకపోతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. ఆటో కార్మికులను బిఆర్‌ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని, మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయడం వాళ్లకు నచ్చడం లేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత విడతలో మహిళలకు 2,500 రూపాయలు, గ్యాస్ సిలిండర్ కోసం రూ. 500, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామని సీతక్క వివరించారు.
కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్య గురించి ముఖ్యమంత్రికి వివరించా: ఎమ్మెల్యే వివేక్
సమీక్ష అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వా మి మాట్లాడుతూ 6 గ్యారంటీలపై చర్చించామన్నారు. కా ళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్య గురించి ముఖ్యమంత్రికి వివరించానని ఆయన తెలిపారు. చెన్నూర్‌లో కొత్త మైన్స్ ఏర్పాటుపై సిఎంకు చెప్పానని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఒక్కో నియోజకవర్గానికి స్పె షల్ డెవలెప్‌మెంట్ ఫండ్ కింద రూ. 10 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారని ఆయన తెలిపారు. రూ.100 కోట్ల డిఎంఎఫ్ నిధుల గురించి కూడా సిఎం దృష్టికి తీసుకెళ్లామని, 26వ తేదీ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో సిఎం రేవంత్ పర్యటన ఉంటుందని వివేక్ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికలపై గురి
- Advertisement -
- Advertisement -
- Advertisement -