Tuesday, November 5, 2024

విద్యుత్‌ను పొదుపు చేస్తే… ఉత్పత్తి చేసినట్లే…

- Advertisement -
- Advertisement -

Focus on power saving:Power department

విద్యుత్ పొదుపుపై దృష్టి సారించాలి
అధికారులు

మన తెలంగాణ, హైదరాబాద్ : విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఇంధనంగా ఉపయోగపడే బొగ్గు కొరత దేశ వ్యాప్తంగా ఉండటంతో విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలని అధికారులు చెబుతున్నారు. ఈ బొగ్గు సంక్షోభం ఉన్నంత కాలం విద్యుత్ వినియోగదారులు విద్యుత్ పొదుపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. బొగ్గు సంక్షోభ ప్రభావం మన మీద కొంత మేరకే ఉన్నా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ పొదుపు చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. గృహ వినియోగదారులు వ్యక్తిగత అలవాట్లను, జీవనశైలిని మార్చుకుంటే విద్యుత్‌ను చాలావరకు పొదుపు చేయవచ్చని చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ను పొదుపు చేయడమంటే ఉత్పత్తి చేయడంతో సమానమంటున్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించేటప్పుడు వాటికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడం ద్వారా బిల్లుల భారాన్ని 20 శాతం వరకు తగ్గించు కోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థం 375 గిగావాట్లుగా ఉంటే గరిష్ట డిమాండ్ 184 గిగావాట్లుగా ఉంటోందని,ఇప్పటికిప్పుడు సమస్య లేక పోయినా పెరుగుతున్న జనాభా అవసరాలు, ఉత్పత్తి పరంగా ఎదురవుతున్న నష్టాలు, పంపిణీలో లోపాలు, తదితర పరిణనామాలను పరిశీలిస్తే విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు.

థర్మల్ స్టేషన్‌లో ఒక కేజీ బొగ్గును మండించి విద్యుత్‌గా మార్చే ప్రక్రియ చేపడితే అందులో గ్రిడ్‌కు చేరేది 360 గ్రాములు మాత్రమే. మిగతా 670 గ్రాములు వృథాఅవుతుందంటున్నారు. అది విద్యుత్ లైన్ల్లోకి చేరేటప్పుడు 15 శాతం సరఫరా, పంపిణీ నష్టాలు ఉంటాయంటున్నారు. విద్యుత్ వివిధ రూపాల్లో మారినప్పుడు అందులో మరి కొంచెం వృథా అవుతుందంటున్నారు. ఫ్యాన్ లాంటిది వాడినప్పుడు దాని మోటారు సామర్థం, ఫ్యాను సామర్ధం వంటి వాటి అంశాల్లో కూడా వృథాకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ దశకు చేరుకునేసరికి విద్యుత్ అవరాలకు ఉపయోగపడిన బొగ్గు 200 గ్రాములు అవుతుంది. అంటే 800 గ్రాముల బొగ్గు వృథా అయినట్లంటున్నారు. విద్యుత్ సరఫరా,పంపిణీ, బిల్లింగ్ లోపాలు, విద్యుత్ చౌర్యంతో భారతదేశం 30 శాతం ఇంధన శక్తిని కోల్పోతుందని, ఇంధన మంత్రిత్వశాఖ పెర్కొనట్లు తెలిపారు.

గృహ వినియోగదారులు వ్యక్తిగత అలావాట్లను, జీవన శైలిని మార్చుకుంటే విద్యుత్‌ను చాలా వరకు పొదుపు చెయవచ్చని చెబుతున్నారు. ప్రకృతి పరంగా సహాజంగా లభించే సూర్యకాంతిని ఉపయోగించుకోవాలని, పగటి సమయంలో విద్యుత్ లైట్లను ఉపయోగించకుండా ఉండాలంటున్నారు. టెలివిజన్, కంప్యూటర్ ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఉపయోగించనప్పుడు వాటికి విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని సూచిస్తున్నారు. ఆయా ఉపకరణాలకు ఉన్న చిన్న లైటు (గోస్ట్ కన్జూమర్స్)వెలుగుతుంటే విద్యుత్ సరఫసరా అవుతున్నట్లు గహించి వెంటనే వాటిని ఆఫ్ చేయాలంటున్నారు. విద్యుత్ పొదుపు ద్వారా 20 నుంచి 30 శాతం వరకు బిల్లు భారాన్ని తగ్గించు కోవచ్చని చెబుతున్నారు.

అంతే కాకుండా ఉపకరాణలను కొనుగోలు చేసే సమయంలో 5 స్టార్ మార్కు ఉన్నవాటిని కొనుగోలు చేయడం ద్వారా 10 నుంచి 30 శాతం విద్యుత్‌ను పొదుపు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఫిల్మెంట్ బల్బులకు బదులు సీఎఫ్‌ఎల్, ఎల్‌ఈడి బల్బులు,ఎల్‌ఈడి ట్యూబ్‌లైట్లను ఉపయోగించాలంటున్నారు. ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలన్నింటిని ఒకే సారి వాటడం సరికాదని,విద్యుత్ ఉపకరణాలకు ప్రత్యామ్నాయంగా సోలార్ ఉపకరణాలపై దృష్టి సారించాలని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News