Friday, December 20, 2024

ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: సీజనల్ వ్యాధులు ప్రబల కుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగందర్ రావు అన్నారు. శనివారం మోతె మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యల పై అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు సమస్యలను ప్రజా ప్రతినిధులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని పేర్కొన్నా రు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయ ంగా ఉంటూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాలని వివరించారు.

మండలంలో లింకు రోడ్ల సమస్యలకు పరిష్కారం చూస్తామని చెప్పారు. విద్యుత్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, ఫోన్లు అందుబాటులో ఉంచి సరఫరాలో ఎ టువంటి అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. అనంతరం ఎంపిపి ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షకా లం సమీపించినందున విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, వాటి బారిన పడకుండా ప్రజల ఆరోగ్యం పై అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని అన్నారు.

అనంతర ం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే విదంగా చూడాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలు సమస్యలను వారికి సర్వసభ్య సమావేశంలో వినిపించారు. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని అన్నారు. అధికారులు పట్టించుకోకుంటే మా దృష్టి కి తీసు కురావాలని ప్రత్యేకంగా ప్రజా ప్రతినిధులు, ప్రజలను కోరా రు. ఈ సమావేశంలో జడ్పిటిసి పందిళ్లపల్లి పుల్లారావు, వైస్ ఎంపిపి మైనంపాటి సునీత మల్లారెడ్డి, ఎంపిడిఓ వెంకటాచారి, ఎంపిఓ హరి సింగ్, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News