Wednesday, January 22, 2025

కొలువుల భర్తీపై ఫోకస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎ న్నికల మేనిఫెస్టోలో ప్రకటించిట్లుగా ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ఉద్యోగార్థుల డిమాండ్ల మేరకు మొ దట టిఎస్‌పిఎస్‌సికి కొత్త చైర్మన్, సభ్యులను ని యమించి ప్రక్షాళన చేసిన సర్కారు, పారదర్శకం గా నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై భరోసా ఏర్పడింది. గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెల్లడించి, ఎంపికైన అభ్యర్థులకు వేగంగా నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వం, త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన 13 వేల మందికి పైగా, గు రుకులాల గ్రాడ్యుయేట్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రెరీయన్లుగా ఉద్యోగాలు సాధించిన 1,997 మందికి, స్టాఫ్‌నర్సులు 7వేల 94 మందికి ప్ర భు త్వం నియామక పత్రాలను అందజేసింది. ఇప్పటి కే గ్రూప్ -4 ఫలితాలను విడుదల చేసిన ప్రభు త్వం త్వరలోనే నియామక పత్రాలు అందించనుం ది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నా యి. మొదటగా గ్రూప్-1 నోటిఫికేషన్లలో పోస్టుల సం ఖ్యను పెంచింది. గత ప్రభుత్వంలో 2022లోనే 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షల నిర్వాహణలో అక్రమాలు, పేపర్ లీకేజీల కారణంగా గ్రూప్- 1 రెండుసార్లు రద్ధయింది. దీనికి మరో 60 పోస్టులు పెంచి 563 పోస్టులతో నూతన నోటిఫికేషన్ విడుదల చేయగా, శుక్రవారం(పిబ్రవరి 23) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మరోవైపు గత ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు జారీ అయ్యి, పరీక్షల నిర్వాహణలో ఆలస్యమవుతున్న గ్రూప్ -2, గ్రూప్ -3 నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు పెంచేందుకు టిఎస్‌పిఎస్‌సి యోచిస్తున్నట్లు తెలుస్తుంది. 2022లో విడుదలైన ఈ నోటిఫికేషన్ల ప్రకారం గ్రూప్ -2లో 783 ఖాళీలు, గ్రూప్- 3లో 1,360కిపైగా పోస్టులున్నా యి. 2022 నుంచి ఇప్పటివరకు ఏర్పడ్డ ఖాళీలను కలుపుకొని అదనంగా మరికొన్ని పోస్టులను కలిపి అనుబంధ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం.
త్వరలోనే మెగా డిఎస్‌సి ప్రకటన
గ్రూప్స్‌తో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ గా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేసే లా మెగా డిఎస్‌సిని నిర్వహిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతేడాది 5,089 ఉ పాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గతప్రభు త్వం నోటిఫికేషన్ జారీ చేయగా, 1,77,502 మం ది దరఖాస్తు చేసుకున్నారు. 2023 నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్యలో రాతపరీక్ష నిర్వహించా ల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పరీక్ష నిర్వహించలేదు. కాగా అప్పట్లో 9,800 పోస్టులు ఉన్నప్పటికీ, రేషనలైజేషన్ ఆధారంగా నాటి ప్రభుత్వం 5,089 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అంశంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం డిఇఒల ద్వారా రాష్ట్రంలోని ఖాళీలను తెలుసుకుంది. ఈ మేరకు పాత నోటిఫికేషన్‌ను అదనంగా దాదాపు 5 వేల పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసినట్లు తెలిసింది. త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో, అంతకు ముందే దాదాపు 11 వేల పోస్టులతో మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తుందని విద్యావేత్తలు చెబుతున్నారు. అలాగే ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోని ఖాళీలను గుర్తిస్తున్న ప్రభుత్వం పోలీసు, రెవెన్యూ, వైద్య, విద్యుత్, అటవీ, వ్యవసాయ తదితర రంగాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. వైద్యారోగ్య శాఖలో 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.
వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు
ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వయోపరిమితిని కూడా సడలించింది. ఉద్యోగార్థుల వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది.అలాగే మేనిఫెస్టోలో ప్రకటించినట్లు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దాంతోపాటు నోటిఫికేషన్ల జారీలో, పరీక్షల నిర్వాహణలో ఎలాంటి లోపాలు లేకుండా కోర్టు కేసుల్లో చిక్కకుండా నియామకాలు ఆలస్యం కాకుండా సర్కారు ముందస్తు చర్యలు తీసుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News