Wednesday, January 22, 2025

సంపద వనాల ఏర్పాటుపై దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -
  • హరిత హారంలో వందశాతం లక్షం సాధించాలి
  • సంగారెడ్డి కలెక్టర్ శరత్

సంగారెడ్డి: హరిత హారంలో వంద శాతం లక్షాన్నీ సాధించాలని, సంపద వనాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి వివిధ అంశాలపై జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా చెరువులు కాల్వ గట్లపైన అటవీ ప్రాంతాలు ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటేలా ఈజిఎస్‌లో వందశాతం గుంతలు తవ్వించాలన్నారు. లేబర్ మొబలైజేషన్ ఎక్కువగా ఉండాలన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌పై దృష్టి సారించాలని పల్లె ప్రకృతి వనం గ్యాప్స్‌లో కొత్త మొక్కలు పెట్టాలన్నారు. తెలంగాణ క్రీడ ప్రాంగణం, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు చుట్టూ బయోఫెన్సింగ్ వేయాలన్నారు.

గ్రామ పంచాయితీ మొదలు జిల్లా స్థాయి వరకు అన్ని కార్యాలయాలలో మొక్కలు పెట్టాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాల్టీలలో ఇంటింటికి మొక్కలు ఇవ్వాలని, ప్రతి ఇంటికి ఎన్ని మొక్కలు ఇచ్చిన, ఉన్న మొక్కల వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాలో పోడు లబ్ధిదారులకు పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఎరువుల కొరత తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, యూరియా, డిఎపి కాంప్లెక్స్ ఎరువుల నిల్వల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సరిపడా ఎరువులు అందుబాటులో ఉండాలని వ్యవసాయ అధికారులకు తెలిపారు. కొత్త రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్డేట్ చేయాలన్నారు.

సిఎంఆర్ కింద కేటాయించి దాన్యం మిల్లింగ్ చేసిన బియ్యం నిల్వలకు సంబంధించి జిల్లా అధికారులతో పాటు తహశీల్దార్‌లు, రైస్ మిల్లులను సందర్శించి కేటాయించిన దాన్యం నిల్వలు ఎంత వాటిలో ఎంత దాన్యం మిల్లింగ్ జరిపారన్న వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను అందజేయాలన్నారు. బిసిలకు లక్షరుపాయల ఆర్థిక సహాయం సంబంధించి కుల వృత్తులకు సంబంధించి కుల వృత్తులు కాకుండా వచ్చిన దరఖాస్థులను పరిశీలించి నిబంధనల మేరకు అర్హల కలిగిన దరఖాస్థులను త్వరగా ఆన్‌లైన్ చేయాలన్నారు. మంజూరైన గ్రామ పంచాయితీ భవనాలు ఈ వారంలోగా గ్రౌండింగ్ చేయాలని ఎంపిడిఓలు, ఎంపిఓలకు అదేశించారు. అన్ని వైకుంఠ ధామాలను విద్యుత్ నీటి కనెక్షన్ ఇవ్వాలన్నారు. ఈ వీడియో సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జడ్‌పి సిఇఓ ఎల్లయ్య తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News