Tuesday, December 24, 2024

స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -
  • ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి

జగదేవ్‌పూర్: స్వయం ఉపాధిపై మొగ్గు చూపాలని రాష్ట్ర ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో నూనతంగా ఏర్పాటు చేసిన హనుమాన్ ట్రెడర్స్ సిమెంట్ స్టీల్ దుకాణాన్ని యజమానులు ఎల్లేశ్, కనకరాజు, భానుప్రసాద్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవ్వరు కూడా ఖాళీగా ఉండకుండా స్వయం ఉపాధి రంగాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులు కన్నవాళ్లకు భారం కాకుండా స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపాలని సూచించారు.

భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఉపాధి బాట పట్టి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. యువకులు చెడు వ్యవసనాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అతిధులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బాలేశం గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ ఇంద్ర సేనారెడ్డి, జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, సర్పంచ్ లక్ష్మి శ్రీనివాస్‌రెడ్డి, మండల కో ఆప్షన్ ఎక్బాల్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బుద్ద నాగరాజు, ఎస్‌ఐ కృష్ణమూర్తి, గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, మండల సర్పంచ్‌లు చంద్రశేఖర్, లావణ్య మల్లేశ్, రాజేశ్వరి, రవి, బిక్షపతి, మంజుల , రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News