Saturday, December 21, 2024

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి: సంగారెడ్డి కలెక్టర్ శరత్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా వాణికి జిల్లా అధికారులందరూ తప్పకుండా హాజరు కావాలని సూచించారు. అన్ని శా ఖల అధికారులు గీవెన్స్ సంబంధించిన ఆయా రిజిష్టర్‌లను సక్రమంగా నిర్వహించాలని, వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని పెండింగ్‌లో ఉన్న వివరా లు రిజిష్టర్‌లలో అపెడేట్ చేయాలన్నారు. రిజిష్టర్‌ల ను సూపర్ చెక్ చేస్తానన్నారు. ఆర్‌డిఓలు రిపీట్ పి టిషనర్స్ రిజిష్టర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రజావాణికి అధికారులు నిర్ణీత సమయంలో హాజరుకావాలని ఆదేశించారు.

చౌటకూర్ మండలంలో ని లింగంపల్లికి చెందిన మన్నె బుచ్చమ్మ 6నెలల కిం ద తన హూమి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేశాన ని, ఇంకా కాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా మ్యూటేషన్ పూర్తయిందన్నారు. ఏలాంటి పెండింగ్ లేదని తెలిపి పాస్‌బుక్ ప్రతిని ఆమెకు అందజేసి ఇక మళ్లీ ప్రజా వాణి రావాల్సిన అవసరం లేదని ఒరిజినల్ పాసుబుక్ ఇంటికే వస్తుందని కలెక్టర్ బుచ్చమ్మ కు చెప్పారు. ప్రజా వాణిలో 68 దరఖాస్తులు వచ్చాయని, అందులో 29 రెవెన్యూశాఖకు సంబంధించివి కాగా మిగిలిన ల్యాండ్ సర్వే ఫించన్‌లు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళిత బంధు, బిసిల ఆర్థిక సాయం, కార్మిక శాఖ, ఆర్టీసి, విజిలెన్స్ ఇరిగేషన్ వ్యవసాయ ఉపాధి కల్పణ, సివిల్ సప్లైలపై పిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్‌లు చం ద్రశేఖర్, మాధురి,డిఆర్‌ఓ నగేష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News