Thursday, December 26, 2024

జానపద కళలను ప్రోత్సహించాలి…

- Advertisement -
- Advertisement -

 

కాసిపేటః మరుగున పడుతున్న జానపద కళలను బతికించుకోవాల్సిన బాధ్యత కళాకారులపై ఉందని జిల్లా చైర్‌పర్సన్ నాల్లాల భాగ్యలక్ష్మీ ఓదేలు అన్నారు. క్రేజీ డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో మందమర్రి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన జానపద హంగామ 2022 చాంపియన్ షిప్‌లో కనగర్తి(ఓదేల) కోలాట బృందం చాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. కళాకారులకు బహుమతి ప్రదానోత్సవానికి ఆమె ముఖ్య అథిదిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె కళాకారులకు 2౦ వేల రుపాయల నగదును అందజేసారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… తెలంగాణరాష్ట్రంలో కళలకు, కళాకారులకు కొదవలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధనలో ముఖ్య భూమిక కూడా కళాకారులదే అని అమె తెలిపారు. కళాకారులను ప్రోత్సహించాల్సిన భాద్యత అందరిపై ఉందని తెలిపారు. కళాకారులు చేపట్టె కార్యాక్రమాలకు తన వంతు సహకారాం ఎప్పుడు ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా నిర్వహాకులు యూట్యూబ్ స్టార్ డి.రాజ్‌కుమార్, నీతుక్వీన్‌లకు ఇయర్ ఆఫ్‌ధి క్రేజి స్టార్ ఆవార్డు, కెకె1 గని మేనేజర్ గొడిసెల లక్ష్మీనారాయణ, రౌతు ప్రేంకుమార్‌లకు లిటిల్ క్రేజిస్టార్ ఆవార్డు, కైచిపూడి నృత్యకళాకారులు మద్దాల నిహారిక, ముద్దాల తరుణి(హైద్రాబాద్), మెడిచెర్ల వైష్ణవి(మంచిర్యాల)లను ఘనంగా సన్మానించారు. అనంతరం విజేతలకు బహుమతులు ఆందజేసారు.

ఈ కార్యాక్రమంలో సంస్థ నిర్వహాకులు ప్రధాన కార్యాదర్శి ఉప్పులేటి నరేష్, సిఎంఓఏఐ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజారమేష్, టిబిజికెఎస్ నాయకులు ఎం. సంపత్, జె. రవీందర్, బి. సంపత్, బత్తుల శ్రీనివాస్,తిరుపతిరెడ్డి, అబ్బాస్, ఎర్ర రాజు, పెద్దుల శ్రీనివాస్, కత్తి చార్లీ, సంకే రాజేష్, కొండు జనార్దన్, సుందిళ్ల రమేష్, మహిళ కళాకారులు ఉప్పులేటి గోపిక, తోకల నిరోష, డాన్స్ మాస్టర్లు హనుమండ్ల మధు, గౌరేశ్, కత్తి రాజీ, ప్రవీణ్‌కుమార్, పాసి విజయ్, పులిపాక దినేష్, దాసరి రాజనర్సు, పవన్‌కుమార్, నెరవెట్ల రాజలింగు, కొత్తపల్లి రమేష్ కళాకారులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News